Top
logo

ఎమ్మెల్యే సోదరుడి అనుమానాస్పద మృతి

ఎమ్మెల్యే సోదరుడి అనుమానాస్పద మృతి
X
Highlights

కరీంనగర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ సోదరుడు గంగుల ప్రభాకర్‌ అనుమానాస్పదస్థితిలో బుధవారం ఉదయం...

కరీంనగర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ సోదరుడు గంగుల ప్రభాకర్‌ అనుమానాస్పదస్థితిలో బుధవారం ఉదయం మృతిచెందారు. ఉదయం కరీంనగర్‌ శివారులోని రేకుర్తి వంతెన వద్ద రోడ్డు పక్కన పడి పోయి ఉండటం గమనించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మృతిచెంది ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రభాకర్ మృతితో ఎమ్మెల్యే కమలాకర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా... ఎమ్మెల్యే సోదరుడు మృతిచెందారన్న వార్త తెలుసుకున్న పలువురు కరీంనగర్‌లోని ఎమ్మెల్యే ఇంటికి పెద్దసంఖ్యలో చేరుకున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని కరీంనగర్ మాక్స్ క్యూర్ ఆస్పత్రికి తరలించారు.

Next Story