Top
logo

కొండ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎదురుదాడి...టీఆర్ఎస్‌లో చేరినప్పుడు దొరతనం కనిపించలేదా

X
Highlights

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలు గుప్పించిన కొండా దంపతులపై ఆ పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. కేసీఆర్‌ది...

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలు గుప్పించిన కొండా దంపతులపై ఆ పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. కేసీఆర్‌ది దొరల పాలన అని విమర్శిస్తున్న కొండా కుటుంబానికి టీఆర్ఎస్‌లో చేరినప్పుడు దొరతనం కనిపించలేదా అని గుండు సుధారాణి ప్రశ్నించారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. అభద్రతాభావంతో కొండా సురేఖ, మురళి మాట్లాడుతున్నారు. కొండా దంపతులు ఒంటెద్దు పోకడలు పోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర కేసీఆర్ కుటుంబానిది అని తెలిపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు అంతా గమనిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో వర్గాలు ఉన్నాయని కొండా దంపతులు ఆరోపిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో గ్రూపులు లేవు. టీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌దే తుది నిర్ణయం. జయశంకర్ సార్ గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తులు కొండా దంపతులు అని సుధారాణి పేర్కొన్నారు.

Next Story