టీఆర్ఎస్ సరికొత్త ఆపరేషన్...కాంగ్రెస్ ముఖ్యుల...

టీఆర్ఎస్ సరికొత్త ఆపరేషన్...కాంగ్రెస్ ముఖ్యుల...
x
Highlights

టీఆర్ఎస్ సరికొత్త ఆపరేషన్ ప్రారంభించింది. నిన్న మొన్నటి వరకు పెద్ద నేతలకు గాలం వేసిన గులాబీ పార్టీ ఇప్పుడు ఎలక్షన్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఆ ఆపరేషన్...

టీఆర్ఎస్ సరికొత్త ఆపరేషన్ ప్రారంభించింది. నిన్న మొన్నటి వరకు పెద్ద నేతలకు గాలం వేసిన గులాబీ పార్టీ ఇప్పుడు ఎలక్షన్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఆ ఆపరేషన్ వివరాలు మీకోసం. 100 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్న టిఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీ ముఖ్యనేతల అనుచరులపై కన్నేసింది. అగ్రనేతలంగా సీట్ల పంపకాలతో కుస్తీ పడుతుంటే వారి అనుచరులకు గులాబీ పార్టీ గాలం వేస్తోంది. ఆయా నేతల కీలక అనుచరులను టీఆర్ఎస్ వైపు ఆకర్షించే ఎలక్షన్ ఆపరేషన్ ప్రారంభించింది. కొందరు టీఆర్ఎస్ నేతలు ఆపరేషన్ ఆకర్ష్‌ ను ముఖ్య నేతల నియోజక వర్గాల్లో శరవేగంగా అమలు చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు జానా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు , డీకే అరుణ, జీవన్ రెడ్డి, చిన్నా రెడ్డి, మల్లు రవి, గీతా రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, జగ్గా రెడ్డి, మహేశ్వర రెడ్డిని టీఆర్ఎస్ టార్గెట్ చేసింది. హస్తం పార్టీలోకి బడా నాయకుల ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్ నుండి టిఆర్ యస్ లోకి వలసలను ప్రోత్సహిస్తున్నారు గులాబీ నేతలు. అలాగే టీడీపీ, సీపీఐ, జన సమితి లోని కీలక నేతలపై కూడా ఫోకస్ పెట్టారు. ఆయా నేతల నియోజక వర్గాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న అనుచరులను కారెక్కించే యత్నం చేస్తున్నారు. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ..పగ్గాలు..చేపట్టాక ముఖ్యమైన పదవులు ఇస్తామని ఎర వేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రముఖులు. ఓడించడం సాధ్యం కాకపోతే వారి మెజార్టీ తగ్గించేలా టీఆర్ఎస్ నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. మరి గులాబీ పార్టీ అధిష్టానం ఆశిస్తున్నట్లు ఎలక్షన్ ఆపరేషన్ వర్కౌట్ అవుతుందో లేదో ఫలితాలు వచ్చాకే తేలుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories