నేడు టీఆర్‌ఎస్ అభ్యర్థులకు బి-ఫారాల పంపిణీ

x
Highlights

నేడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండటంతో తమ అభ్యర్థుల నామినేషన్ల కోసం బి-ఫారాలను అందించబోతోంది టీఆర్ఎస్. తెలంగాణ భవన్‌లో నేటి సాయంత్రం 4గంటలకు...

నేడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండటంతో తమ అభ్యర్థుల నామినేషన్ల కోసం బి-ఫారాలను అందించబోతోంది టీఆర్ఎస్. తెలంగాణ భవన్‌లో నేటి సాయంత్రం 4గంటలకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా బి-ఫారాలు అందించనున్నారు. 107 మంది అభ్యర్థులకు బి-ఫారాలను అందించి, మార్గనిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్. మరోవైపు పార్టీ మేనిఫెస్టోను కూడా ఆయన ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

టీఆర్ఎస్ తొలి విడతలో ప్రకటించిన 107 మంది అభ్యర్థులకు బి-ఫారాలు ఇవ్వబోతున్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. తెలంగాణ భవన్‌లో బి-ఫారాలు అందుకునేందుకు రావాల్సిందిగా వారందరినీ ఆహ్వానించారు. ఈనెల 12న మొదలయ్యే నామినేషన్ల ప్రక్రియ 19వ తేదీలో ముగుస్తుంది. దీంతో మిగిలిన 12 మంది అభ్యర్థుల పేర్లును కూడా ఖరారు చేసి బి-ఫారాలు అందించనున్నారు. బి-ఫారాల పంపిణీకి ముందు కేసీఆర్ తన ఇష్టదైవమైన కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లనున్నారు కేసీఆర్. ఈ సందర్భంగా బి-ఫారాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి తెలంగాణ భవన్‌కు తీసుకొస్తారు. అనంతరం అభ్యర్థులకు ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి, ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలి తదితర విషయాలను అభ్యర్థులతో చర్చించనున్నారు కేసీఆర్.

ఇప్పటికే అభ్యర్థుల పరిస్థితిపై సర్వే చేయించిన కేసీఆర్.. 20-30 నియోజకవర్గాల్లో వ్యతిరేకతలు ఉన్నా వారిని మార్చేందుకు సాహసించడం లేదు. ప్రత్యర్థులు ఎవరన్న దానిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న ఆయన అక్కడ గెలుపు బాధ్యతలను సీనియర్లకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. దాంతోపాటు ఒకటికి రెండుసార్లు ఆయనే ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. మరోవైపు మేనిఫెస్టోపై ప్రణాళిక కమిటీతో తుది చర్చలు జరిపిన కేసీఆర్ పూర్తి స్థాయి మేనిఫెస్టోను కూడా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories