శ్రద్ధాకపూర్‌పై క్రిమినల్‌ కేసు నమోదు

శ్రద్ధాకపూర్‌పై క్రిమినల్‌ కేసు నమోదు
x
Highlights

బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ పై క్రిమినల్ కేసు నమోదైంది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవిత కథ ఆధారంగా 'హసీనా పార్కర్' అనే సినిమా...

బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ పై క్రిమినల్ కేసు నమోదైంది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవిత కథ ఆధారంగా 'హసీనా పార్కర్' అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను అపూర్వ లఖియా తెరకెక్కించాడు. సెప్టెంబర్ 22న ఈ చిత్రం విడుదలైంది. సినిమా పెద్ద హిట్ కాకపోయినప్పటికీ శ్రద్ధాకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ సినిమాలో శ్రద్ధ వేసుకున్న దుస్తులను ముంబయికి చెందిన ఓప్రముఖ దుస్తుల కంపెనీ డిజైన్‌ చేసిందట. కంపెనీతో కాంట్రాక్ట్‌ కుదుర్చుకునే ముందు సినిమాలో దుస్తుల కంపెనీ పేర్లు వేస్తామని చెప్పి నిర్మాత నహిద్‌ ఖాన్‌ మాటిచ్చారట. కానీ సినిమా మొత్తంలో ఎక్కడా కంపెనీ పేరు వేయకపోవడంతో యాజమాన్యం నిర్మాత నహిద్‌ ఖాన్‌, శ్రద్ధా కపూర్‌పై ముంబయిలోని అంధేరీ మెట్రోపాలిటన్‌ కోర్టులో పిటిషన్‌ వేసింది. దర్యాప్తు చేసిన తర్వాతే ఏ విషయం అన్నది వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories