చిక్కుల్లోపడ్డ బోయపాటి, త్రివిక్రమ్

బోయపాటి శ్రీను..త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కొత్త చిక్కు వచ్చిపడింది. ఎన్టీఆర్..రామ్ చరణ‌్ సినిమాలు ఒఫ్పుకోవడంతో ...
బోయపాటి శ్రీను..త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కొత్త చిక్కు వచ్చిపడింది. ఎన్టీఆర్..రామ్ చరణ‌్ సినిమాలు ఒఫ్పుకోవడంతో ఊహించని ఒత్తిడిని ఫేస్ చేయనున్నారు. దాదాపు మెడ మీద కత్తపెట్టుకుని పనిచేయాల్సిన పరిస్థితి ఈ ఇద్దరు డైరెక్టర్లకు వచ్చిపడింది. డైడ్ లైన్ గంటను మెడకుకట్టుకుని మరీ తర్వాత ప్రాజెక్టుకు వర్కచేయాల్సిన పరిస్థితిలో పడ్డారు. బోయపాటి..త్రివిక్రమ్ ను తిప్పలు పెడుతోంది కూడా ఒక డెరెక్టర్ కావడం విశేషం.
జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. వరసగా నాలుగు హిట్లు కొట్టాడు. పెద్ద హిట్ మీద కన్నేసిన తారక్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో నెక్సట్ మూవీకి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే నాలుగు హిట్స్ కొట్టిన త్రివిక్రమ్ అజ్ణాతవాసితో ఐదో హిట్ కొట్టే ఊపులో ఉన్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ పై ఇండస్ట్రీలో ఇప్పటికే విపరీతమైన టాక్ నడుస్తోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ మొన్న రెండో తారీఖు నుంచి స్పెషల్ ట్రెయినర్ గైడెన్స్ లో కసరత్తులు చేస్తున్నాడు. ఫిభ్రవరి 17 వరకు మంచి రోజులు లేకపోవడంతో..మూడో వారం నుంచి తారక్-త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మొదలు కానుంది. అంతా సవ్యంగా జరుగుతున్న ఈ దశలో..త్రివిక్రమ్ మెడమీదకు పదునైన కత్తి వచ్చి చేరింది.
త్రివిక్రమ్ ఫేస్ చేయనున్న సిట్యుయేషనే బోయపాటికి ఎదురుకానుంది. జయ జానికీ నాయక సినిమా తర్వాత బోయపాటి శ్రీను- రామ్ చరణ్ తో సినిమా కమిట్ అయ్యాడు. డివివి దానయ్య బ్యానర్లో సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. రంగస్థలం పని పూర్తైన వెంటనే చరణ్ - బోయపాటి ప్రాజెక్టులోకి ఎంటరవుతాడు. ఫుల్లెంగ్త్ మాస్ మసాలా సినిమా కోసం చూస్తున్న రామ్ చరణ్ - బోయపాటి మూవీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ సెట్ అవుతుందనుకునేలోపు బోయపాటిని ప్రెజర్ లోకి నెట్టేస్తున్నాడు రామ్ చరణ్.
త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను చాలా చిత్రమైన పరిస్థితుల్లో ఇరుక్కోబోతున్నారు. ఏ ఇద్దరు హీరోలతోనైతే సినిమాలు చేస్తున్నారో వాళ్ల వల్లే ఇబ్బందులు పడనున్నారు. ఈ ప్రాజెక్టులు ఓకే ఐన తర్వాత అనూహ్యంగా రామ్ చరణ్, తారక్ రాజమౌళి తో సినిమాకు కమిటయ్యారు. ఈ సినిమా ప్రపోజల్ రావడంతోనే చరణ్, తారక్ ఎగిరి గంతేశారు. దాదాపు జక్కన్న చంకెక్కాశారు. అటు జక్కన్న కూడా ఈ మల్టీస్టారర్ పై ఫుల్ స్పీడ్లో గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టేయాలని ప్లాన్ చేస్తున్నాడు. జక్కన్న ఊ అన్న క్షణంలోనే దూకేయడానికి తారక్, చరణ్ రెడీగా ఉన్నారు. దీంతో బోయపాటి, త్రివిక్రమ్ సినిమాలకు అక్టోబర్ అనఫిషియల్ డెడ్లైన్ ఐపోయింది.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
ప్రభాస్ ఎలివేషన్ లపై దృష్టి పెట్టానున్న ప్రశాంత్ నీల్
28 May 2022 11:00 AM GMTMalla Reddy: ఎన్టీఆర్కు భారత రత్న కోసం పార్లమెంట్లో పోరాడతాం
28 May 2022 10:52 AM GMTATM PIN Number: ఏటీఎం పిన్ నెంబర్ 4 అంకెలు మాత్రమే ఎందుకు.. కారణం...
28 May 2022 10:45 AM GMTనెల్లూరు జిల్లా శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో...
28 May 2022 10:28 AM GMTరథం తరలిస్తుండగా.. విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురి మృతి
28 May 2022 10:25 AM GMT