ట్రిపుల్ తలాక్ అంశంలో కీలక పరిణామం

ట్రిపుల్ తలాక్ అంశంలో కీలక పరిణామం
x
Highlights

ట్రిపుల్ తలాక్ బిల్లు ఇవాళ పార్లమెంటు ముందుకు రాబోతోంది. ట్రిపుల్ తలాక్‌‌ చెప్పి విడాకులు ఇవ్వడాన్ని నిషేధించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇవాళ...

ట్రిపుల్ తలాక్ బిల్లు ఇవాళ పార్లమెంటు ముందుకు రాబోతోంది. ట్రిపుల్ తలాక్‌‌ చెప్పి విడాకులు ఇవ్వడాన్ని నిషేధించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలన్నీ ఎంపీలకు విప్ జారీ చేశాయి. తప్పనిసరిగా సభకు హాజరు కావాలని ఆదేశించాయి. ట్రిపుల్ తలాక్ విధానం చెల్లదని, చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. ట్రిపుల్ తలాక్ నిషేధ బిల్లును రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో ట్రిపుల్ తలాక్ బిల్లును కేంద్రం తయారుచేసింది. బిల్లు చట్టరూపం దాల్చగానే ట్రిపుల్ తలాక్ చెప్పిన వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories