Top
logo

దారుణం: మహిళా బీజేపీ నేతపై..

X
Highlights

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు రెచ్చిపోయారు. బీజేపీకి చెందిన ఓ మహిళా కార్యకర్తపై టీఎంసీ...

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు రెచ్చిపోయారు. బీజేపీకి చెందిన ఓ మహిళా కార్యకర్తపై టీఎంసీ నేతలు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దారుణ సంఘటన సెప్టెంబర్ 26న చోటు చేసుకోగా... ఆలస్యంగా వెలుగు చూసింది. సెప్టెంబర్‌ 26 న బీజేపీ రాష్ట్ర బంద్‌ నేపథ్యంలో దిసర్కార్‌ అనే మహిళా నేత తమ కార్యకర్తలతో కోల్‌కతాకు 40 కిలోమీటర్లో దూరంలో ఉన్న బారసత్‌లో రైల్‌రోకో నిర్వహించే ప్రయత్నం చేశారు. దీనిని అడ్డుకునేందుకు వచ్చిన తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత, ఆ పంచాయతీ ఛీఫ్‌ అర్షదుజ్జమాన్‌ సదరు మహిళపై దాడి చేశాడు. కర్రలతో ఆమెను కొడుతూ ఒక తన్ను తన్ని పరుగెత్తించాడు. ఈ ఘటననంతా ఒకరు సెల్‌ఫోన్‌లో రికార్డ్‌ చేశారు. ఇక ఈ దాడి గురించి ఆమెను ఓ మీడియా రిపోర్టర్‌ తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా.. మరోసారి ఆమెపై మీడియా సాక్షిగానే దాడి చేశారు. ఈ వరుస ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

Next Story