ప్రపంచంలోనే తొలిసారి.. బిడ్డకు పాలిచ్చిన ట్రాన్స్‌జెండర్!

ప్రపంచంలోనే తొలిసారి.. బిడ్డకు పాలిచ్చిన ట్రాన్స్‌జెండర్!
x
Highlights

ప్రపంచంలో తొలిసారి జరిగిన వింత ఇది. 30 ఏళ్ల ఓ ట్రాన్స్‌జెండర్ మహిళ తన బిడ్డకు పాలిచ్చింది. తొలిసారి ఓ ట్రాన్స్‌జెండర్ మహిళ.. తన భాగస్వామికి జన్మించిన...

ప్రపంచంలో తొలిసారి జరిగిన వింత ఇది. 30 ఏళ్ల ఓ ట్రాన్స్‌జెండర్ మహిళ తన బిడ్డకు పాలిచ్చింది. తొలిసారి ఓ ట్రాన్స్‌జెండర్ మహిళ.. తన భాగస్వామికి జన్మించిన బిడ్డకు పాలిచ్చింది. బ్రిటన్, కెనడాల్లో వినియోగంలో ఉన్న, అమెరికాలో నిషేధించిన ఔషధాలతో ఆ ట్రాన్స్‌జెండర్ మహిళ.. బిడ్డకు పాలిచ్చేలా చికిత్స చేశారు అమెరికా వైద్యులు. ఓ 30 ఏళ్ల మహిళకు జన్మించిన మగబిడ్డకు ఆ ట్రాన్స్‌జెండర్ మహిళ పాలిచ్చినట్టు న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్ సెంటర్ ఫర్ ట్రాన్స్‌జెండర్ మెడిసిన్ అండ్ సర్జరీ విభాగానికి చెందిన డాక్టర్ తమర్ రీస్మన్ తెలిపారు. అసలు ట్రాన్స్‌జెండర్లలో పాల ఉత్పత్తి అనేదే ఉండదని, కానీ, తొలిసారిగా ఓ ట్రాన్స్‌జెండర్‌కు ఔషధాల ద్వారా చికిత్సను అందించి పాలు ఉత్పత్తయ్యేలా చేశామని తెలిపారు. ఇప్పుడు ఆ ట్రాన్స్‌జెండర్ తన భాగస్వామికి కలిగిన మగబిడ్డకు సరిపడా పాలు ఇస్తోందని చెప్పారు. దాదాపు ఆరు వారాలుగా ఆమెలో పుష్కలంగా పాలు ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. ఎలాంటి శస్త్రచికిత్సలు లేకుండానే అందులో సఫలీకృతులైనట్టు వివరించారు. అయితే, వైద్యుల ఘనతను కొందరు కీర్తిస్తుంటే.. కొందరు మాత్రం అది అనైతికం, ప్రమాదకరం అంటున్నారు. మరోవైపు ఇది.. ట్రాన్స్‌జెండర్లూ పిల్లలు కనేలా చేసేందుకు ఈ ప్రయోగం బాటలు వేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే, ఆ ట్రాన్స్‌జెండర్.. పిల్లాడికి పాలిచ్చే వ్యవహారాన్ని మాత్రం అధికారికంగా ఏ వైద్య నిపుణులు చేపట్టలేదు. ఇదే తొలిసారి. ఈ ప్రయోగంలో పాల్పంచుకున్న ఆ ట్రాన్స్‌జెండర్, ఆమె భాగస్వామి ఎవరన్నది మాత్రం గోప్యంగా ఉంచారు వైద్యులు. వారి వివరాలు వెల్లడించలేదు. 2011 నుంచి ట్రాన్స్‌జెండర్‌కు ఆ చికిత్సను అందించారు వైద్యులు.


Show Full Article
Print Article
Next Story
More Stories