టీవీ ప్రేక్షకులపై వినోదభారం...కొత్త నిబంధనలతో...

x
Highlights

టెలివిజన్ ప్రేక్షకులకు కొత్త సంవత్సరం నుంచి వినోదం మరింత భారం కాబోతుంది. కేబుల్ టీవీతో పాటు డీటీహెచ్ ల ద్వారా ప్రసారం అవుతున్న టీవీ ఛానళ్లు వీక్షించే...

టెలివిజన్ ప్రేక్షకులకు కొత్త సంవత్సరం నుంచి వినోదం మరింత భారం కాబోతుంది. కేబుల్ టీవీతో పాటు డీటీహెచ్ ల ద్వారా ప్రసారం అవుతున్న టీవీ ఛానళ్లు వీక్షించే వినియోగదారులు భారం మోయాల్సి వస్తోంది. టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కొత్త టారిఫ్ విధానాన్ని ప్రకటించింది. కొత్త ఎమ్మార్పీల ప్రకారం ప్రస్తుతం ఉన్న బిల్స్ కంటే ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.

ఇంట్లో కూర్చొని టెలివిజన్ ప్రసారాలు వీక్షించే ప్రేక్షకులపై వినోదభారం అధికం కాబోతుంది. ప్రస్తుతం ప్రతి నెల కేబుల్ ఆపరేటర్లకు బిల్లు చెల్లించి వారు ప్రసారం చేస్తున్న ఛానళ్లు చూస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఆన్ లాగ్ నుంచి డిజిటల్ ప్రసారాలు మారిందంటూ ఇళ్లలో సెట్ టాప్ బాక్స్ లు ఏర్పాటు చేసుకున్నారు. పట్టణాలు, ప్రధాన నగరాల్లో 250 నుంచి 400 ఛానళ్ల వరకు ప్రసారాలు జరుగుతున్నాయి.

కేబుల్ టీవీలు ప్రసారం చేస్తున్న ఛానళ్లలో ఉచితంగా ప్రసారమయ్యే వార్తా ఛానళ్లతో పాటు ఎంటర్ టైన్ మెంట్, సినిమాలు, వంటల ప్రోగ్రాం, స్పోర్ట్స్ ఛానళ్లు ఉన్నాయి. నగరాల్లో మాస్టర్ ఆపరేటర్ చేసే ప్రసారాలను తీసుకొని స్థానిక ఆపరేటర్ ఆయా ప్రాంత వినియోగదారులకు అనుగుణంగా ఉండే ఛానళ్లను ప్రసారం చేస్తున్నారు.

కొత్త కేబుల్ విధానం ద్వారా కేబుల్ టీవీ కనెక్షన్ కు కూడా ప్రీపెయిడ్ పద్దతిలో ముందే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఉచితంగా ప్రసారం అవుతున్న వంద చానళ్లకు మాత్రమే కేబుల్ టీవీ సంస్థలన్నీ 130 రూపాయలతో పాటు జీఎస్టీ ఛార్జీలు వసూలు చేయాల్సి ఉంటుంది. మిగతా ఛానల్స్ చూడాలనుకుంటే అదనంగా నగదు చెల్లించాల్సి ఉంటుంది. తెలుగులో సీరియల్స్, సినిమాలు ప్రసారం అవుతున్న చానల్స్ చూడాలన్నా ప్రస్తుతం చెల్లించే బిల్లు కంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వుంటుందని మాస్టర్ నెట్ వర్క్ ఆపరేటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కొత్తగా ట్రాయ్ నిర్ణయించిన లెక్కల ప్రకారం దాదాపు నెలకు 800 నుంచి 900 రూపాయల వరకు చెల్లిస్తేనే కేబుల్ ప్రసారాలు చూసే వీలుంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఒక సారి సెట్ టాప్ బాక్స్ లు ఏర్పాటు కోసం ప్రతి వినియోగదారుడు రెండు వేలు చెల్లించామని కొత్త నిబంధనలతో అదనపు భారం పడుతుందని వినియోగదారులు వాపోతున్నారు. నూతన కేబుల్ విధానంపై కేబుల్ ఆపరేటర్లు వినియోగదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కొత్త విధానం అమలులోకి వచ్చాక వినియోగదారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories