రైల్వే టికెట్ల రిజర్వేషన్ రూల్స్ మారాయి!

రైల్వే టికెట్ల రిజర్వేషన్ రూల్స్ మారాయి!
x
Highlights

రైల్వే టికెట్ల రిజర్వేషన్ వ్యవహారాల్లో మరోసారి రూల్స్ మారాయి. టికెట్ల బుకింగ్, కేన్సిలేషన్లకు సంబంధించి ప్రయాణికులకు కాస్త వెసులుబాటు కల్పిస్తూ రైల్వే...

రైల్వే టికెట్ల రిజర్వేషన్ వ్యవహారాల్లో మరోసారి రూల్స్ మారాయి. టికెట్ల బుకింగ్, కేన్సిలేషన్లకు సంబంధించి ప్రయాణికులకు కాస్త వెసులుబాటు కల్పిస్తూ రైల్వే శాఖ నిబంధనలు సడలించింది. టికెట్ బుక్ అయిన రైలు.. ఏ కారణం చేత అయినా మూడు గంటలు ఆలస్యంగా వస్తే.. ఇకపై పూర్తి డబ్బులు వాపస్ తీసుకోవచ్చు.

అంతే కాదు.. రైలును మరో మార్గానికి మళ్లించినా.. కేటాయించిన కోచ్ లో బెర్త్ ఇవ్వకపోయినా.. చెల్లించిన ధరకు సరిపోను ప్రయాణ వసతి కల్పించికపోయినా కూడా ప్రయాణికుడు కోరితే టికెట్ ధరను పూర్తిగా వాపస్ చేయనుంది.. రైల్వే శాఖ. ఇక.. ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్టుల టికెట్లను ప్రయాణానికి ముప్పై నిముషాల ముందు రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నా కూడా.. క్లరికల్ చార్జీలు మినహాయించుకుని డబ్బులు ఇచ్చేస్తామని రైల్వే శాఖ ప్రకటించింది.

ఈ వివరాలపై ప్రయాణికులు అవగాహన పెంచుకోవాలని సూచించిన రైల్వే శాఖ.. వెసులుబాటును ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చింది. మరోవైపు.. పదే పదే నిబంధనలు మారుస్తున్న రైల్వే శాఖ.. రైల్వే రిజర్వేషన్ల కౌంటర్ల దగ్గర.. మార్చిన నిబంధనలపై డిజిటల్ బోర్డుల్లో ప్రచారం చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఆశించవచ్చని ప్రయాణికులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories