logo
సినిమా

ప్రకాష్ రాజ్.. ముందు నీ అహంకారం తగ్గించు: టాలీవుడ్ నిర్మాత

ప్రకాష్ రాజ్.. ముందు నీ అహంకారం తగ్గించు: టాలీవుడ్ నిర్మాత
X
Highlights

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఓ ప్రశ్న సంధించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఓ ప్రశ్న సంధించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 150+ సీట్లలో గెలుపొందుతుందనీ ఢంకాబజాయించారు. మరి ఇపుడు 150 సీట్లు ఎక్కడ అంటూ ప్రశ్నించారు. గుజరాత్ అసెంబ్లీ ఫలితాలపై ప్రకాష్ రాజ్ 'జస్ట్ ఆస్కింగ్' అంటూ సోమవారం ఓ పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ పై టాలీవుడ్ నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు.

`నీ గోల ఎంటో అస్స‌లు అర్థం కావ‌డం లేదు. నీ అహంకారంతో ప్రొడ్యూస‌ర్ల‌ను, డైరెక్ట‌ర్ల‌ను ఇబ్బంది పెడుతుంటావు కదా. నువ్వు సంతోషంగా ఉన్నావా? కేవ‌లం హెడ్‌లైన్స్‌లో ఉండాల‌ని ప్ర‌య్న‌త్నించ‌కు. స‌మ‌స్య‌లపై పోరాటం చేయ్‌. ప్రభావ‌వంత‌మైన నాయ‌కుడిగా ఎదుగు. అప్పుడు ఎదుటివారిపై కామెంట్ చెయ్‌. అప్పుడు మేం నిన్ను సీరియ‌స్‌గా తీసుకుంటాం` అని శ్రీధ‌ర్ ట్వీట్ చేశారు.


Next Story