logo
సినిమా

కమెడియన్‌ విజయ్‌ ఆత్మహత్య

Highlights

సినిమా అవకాశాలు లేక కమెడియన్‌ విజయ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలో నివాసం ఉంటున్న విజయ్‌...

సినిమా అవకాశాలు లేక కమెడియన్‌ విజయ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలో నివాసం ఉంటున్న విజయ్‌ సినిమాల్లో అవకాశాలు లేక తీవ్ర ఆందోళన చెందాడు. తన ఫ్లాట్‌లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అమ్మాయిలు అబ్బాయిలు, బొమ్మరిల్లులో వంటి సినిమాల్లో విజయ్‌ కమెడియన్‌గా నటించాడు. తెలుగులో పలు చిత్రాల్లో కమెడియన్‌గా నటించిన విజయ్ అందరి అభినందనలు అందుకున్నాడు. కాగా విజయ్ ఆత్మహత్యపై తెలుగు చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

Next Story