Top
logo

మహాకూటమిలో భగ్గుమన్న విభేదాలు...ఆదిలోనే తప్పుకునే ప్రయత్నంలో ...

X
Highlights

కేసీఆర్‌కు వ్యతిరేకంగా పురుడు పోసుకున్న మహాకూటమిలో అప్పుడే విభేదాలు భగ్గుమంటున్నాయి. తెలుగుదేశం పొత్తును...

కేసీఆర్‌కు వ్యతిరేకంగా పురుడు పోసుకున్న మహాకూటమిలో అప్పుడే విభేదాలు భగ్గుమంటున్నాయి. తెలుగుదేశం పొత్తును ముఖ్యంగా తెలంగాణ జనసమితిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే మహాకూటమి సమావేశాలకు కోదండరామ్‌ దూరంగా ఉంటూ వస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కూటమిలోకి టీడీపీ రావడానికి వ్యతిరేకిస్తున్న టీజేఎస్‌ పెద్దలు చర్చల్లో పాల్గొనేందుకు ముఖం చాటేస్తున్నారని చెబుతున్నారు. అందులో భాగంగానే ఎక్కువ సీట్లు డిమాండ్‌ చేస్తున్నారనే వాదనలు కూడా వస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్‌ సైతం ఎటూ తేల్చకపోవడంతో మరో ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే వరకు వేచిచూసే బదులు ఆదిలోనే తప్పుకుంటే మంచిదన్న అభిప్రాయానికి కోదండరామ్‌ పార్టీ వచ్చినట్లు తెలుస్తోంది.

Next Story