ఆస్తుల వేలంపై దావుద్ ఆగ్రహం..ముంబై తరహా దాడులు మళ్లీ చేస్తాం

Highlights

తన ఆస్తుల వేలంపై ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్‌ ఇబ్రహీం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద మూడు దావూద్ కు చెందిన ఆస్తులను వేలం...

తన ఆస్తుల వేలంపై ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్‌ ఇబ్రహీం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద మూడు దావూద్ కు చెందిన ఆస్తులను వేలం వేయాలంటూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని దావుద్ కు చెందిన రానక్ అఫ్రోజ్ అనే హోటల్ ను వేలం వేయగా.. సైఫీ బుర్హానీ ట్రస్ట్ రూ.11కోట్లకు సొంతం చేసుకుంది. అయితే ఈ వేలంపై.ఓ టీవీ ఛానెల్ కి ఫోన్ చేసి, తనను తాను దావూద్ అనుచరుడిగా పరిచయం చేసుకున్న ఉస్మాన్ చౌదరి మాట్లాడుతూ ఆస్తుల వేలంపై దావుద్ ఆగ్రహం ఉన్నాడని అన్నాడు. అంతేకాదు వేలం వేసిన స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు జరగకుండా చేస్తామని బెదిరించాడు. ఒకవేళ నిర్మాణాలు చేపడితే సహించమని ..1993నాటి పేలుళ్లులను మరించి పోయారా..?అంతకంటే పెద్ద దాడులు చేస్తాం అని హెచ్చరించాడు.
1993 పేలుళ్లు
ఉ..గ్ర..వా..దం... ఎనిమిదో దశకం నుంచే భారతదేశాన్ని వణికిస్తున్న అంశమిది. ప్రగతి బాటలో పయనిస్తున్న నవభారతంలో ఉన్నట్టుండి ఒక్క కుదుపు..కుదుపింది ఈ ఉగ్రవాదం. ఖలిస్తాన్ పేరుతో పంజాబ్ రాష్ట్రంలో మొదలైన ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి భారీ ఎత్తున ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ నిర్వహించాల్సి వచ్చింది. దాంతో దేశంలో ఉగ్రవాదం దాదాపుగా ముగిసినట్లేనని అనుకుంటున్న తరుణంలో.. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో ఉగ్రదాడి జరిగింది. 1993 శుక్రవారం మార్చి 12న 1:30 నుంచి 3:40 గంటల వ్యవధిలో జరిగిన వరుస ఆర్డీఎక్స్ పేలుళ్లలో 257 మంది దుర్మరణం పాలయ్యారు.713 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత భారీ స్థాయిలో ఆర్డీఎక్స్ వినియోగం జరగడం అదే మొదటిసారని తేలింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెల్లార్లో తొలి బాంబు పేలింది. కార్లు, స్కూటర్లలో బాంబులు పెట్టారు. సూట్కేసులలో బాంబులు పెట్టి హోటళ్లలో విడిచిపెట్టారు. వాస్తవానికి శివాజీ జయంతి సందర్భంగా ఏప్రిల్లో ఈ దాడులు చేయాలనుకున్నారు. కానీ ఉగ్రవాద శిక్షణకు ఎంపిక చేసిన గుల్ నూర్ మొహమ్మద్ షేక్ను మార్చి 9న పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ప్లాన్ లీక్ అవుతుందనే భయంతో మార్చి 12నే అమలు చేశారు.
1993 పేలుళ్ల కుట్రలో పాల్గొన్న ఉగ్రవాదులు
దావూద్ ఇబ్రహీం ఆధ్వర్యంలోని డి కంపెనీ మాఫియా పేలుళ్లకు వ్యూహరచన చేసింది. దావూద్‌తో పాటు టైగర్ మెమన్, మొహమ్మద్ దోసా, ముస్తఫా దోసా ఈ దాడుల కుట్రలో పాలు పంచుకున్నారు. భారత ప్రభుత్వాన్ని భయపెట్టడం, ప్రజల్లో భయాందోళనలు కలిగించడం, ఓ వర్గం ప్రజలను భారతీయ సమాజానికి దూరం చేయడం, దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీయడం కుట్ర ప్రధానోద్దేశం.
దావుద్ ఆస్తులు
దావూద్ ఇబ్ర‌హీం ఆస్తుల గురించి బ్రిట‌న్‌కు చెందిన మిర్ర‌ర్ ప‌త్రిక ఆస‌క్తిక‌ర‌ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. 1993 ముంబై పేలుళ్ల ప్ర‌ధాన సూత్ర‌ధారి అయిన దావూద్‌ ఆస్తులు సుమారు రూ.43 వేల కోట్లు ఉంటాయ‌ని ఆ ప‌త్రిక త‌న క‌థ‌నంలో పేర్కొంది. ప్రపంచంలో అత్యంత సంపన్న డాన్ గా మొదటిస్థానంలో కొలంబియాకు చెందిన డ్ర‌గ్ వ్యాపారి పాబ్లో ఎస్కోబార్, రెండోస్థానంలో దావూద్ నిలుస్తాడ‌ని ఆ ప‌త్రిక పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories