Top
logo

‘తొలిప్రేమ’ ట్రైలర్‌ విడుదల

X
Highlights

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘తొలిప్రేమ’. రాశీ ఖన్నా కథానాయిక. వెంకీ అట్లూరి...

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘తొలిప్రేమ’. రాశీ ఖన్నా కథానాయిక. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో వరుణ్‌ తేజ్‌..‘జ్ఞాపకాలు.. చెడ్డవైనా, మంచివైనా ఎప్పుడూ మనతోనే ఉంటాయి. మోయక తప్పదు’ అంటున్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. రాశిఖన్నా, వరుణ్ కెమెస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. రాశి తన ఇంతకు ముందు సినిమాల్లో కన్నా చాలా అందంగా కనిపించింది. లవ్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా సినిమా కనిపిస్తోంది. వరుణ్ ఇలాంటి సినిమాలో నటించడం ఇదే ఫస్ట్ టైమ్ అనిపిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే సినిమాపై అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story