ఒగ్గేయండి సార్..ప్ర‌దీప్ చిన్న‌పిల్లోడు

ఒగ్గేయండి సార్..ప్ర‌దీప్ చిన్న‌పిల్లోడు
x
Highlights

న్యూ ఇయర్‌ రోజు డ్రంకెన్‌ డ్రైవ్‌లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రదీప్‌ ఎవరికి టచ్‌లో లేకుండా పోయాడు. మోతాదుకు మించి మద్యం సేవించి కారు డ్రైవ్‌...

న్యూ ఇయర్‌ రోజు డ్రంకెన్‌ డ్రైవ్‌లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రదీప్‌ ఎవరికి టచ్‌లో లేకుండా పోయాడు. మోతాదుకు మించి మద్యం సేవించి కారు డ్రైవ్‌ చేసిన ప్రదీప్‌ను కౌన్సిలింగ్ కు రావాలని నోటీసులు పంపినా హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం
ఈ నేప‌థ్యంలో డ్రంక‌న్ డ్రైవ్ కేసుపై ప్ర‌దీప్ అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. కొంత‌మంది అభిమానులు ప్ర‌దీప్ చ‌ర్య‌ల్ని ఖండిస్తుంటే ..మ‌రికొందరు ప్ర‌దీప్ ను వ‌దిలేయాల‌ని కామెంట్ చేస్తున్నారు. ఇక ఇన్ స్ట్రా గ్రాం హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీస్ గ్రూఫ్ లో ప్ర‌దీప్ ను వ‌దిలేయాలంటూ ఓ యువ‌తి పోస్ట్ చేసింది. హనీ భవాని అనే అమ్మాయి..సార్ ప్లీజ్ మా యాంకర్ ప్రదీప్ ని ఒగ్గేయండి సార్.ప్రదీప్ చిన్న పిల్లోడు అని ఆమె పెట్టిన కామెంట్ పెట్టింది. దీనిపై హైదరాబాద్ పోలీసు చిన్నపిల్లోడు అయితే ఇంట్లో కూర్చుని పాలు తాగాలి..మందు తాగి కార్ నడపకూడదు..అంటూ రిప్లై ఇచ్చారు.
ఇదిలా ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడినప్పటి నుంచి వారం రోజుల్లోపు కౌన్సిలింగ్‌‌కు రావాల్సి ఉంటుంది. కానీ మూడ్రోజులైన ప్రదీప్‌ హాజరుకాలేదు. ఇంటికి, ఆఫీస్‌కు తాళాలు వేయడంతో పాటు ప్రదీప్‌ ఫోన్‌ స్విచ్చాఫ్ కావడంతో పరారీలో ఉన్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు ప్రదీప్ కౌన్సెలింగ్‌ కు హాజరు కాకుంటే ఛార్జీషీట్ దాఖలు చేసి వారెంట్ జారీ చేసి, కౌన్సెలింగ్ ఇచ్చాకే కోర్టులో ప్రవేశ పెడతామని పోలీసులు చెబుతున్నారు. ప్రదీప్ చర్యను బట్టి తమ తదుపరి చర్యలు ఉంటాయన్నారు. మరి ప్రదీప్ కౌన్సిలింగ్‌కు వస్తాడా రాడా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories