మానస సరోవర్‌లో భారీ వర్షాలు..చిక్కుకుపోయిన తెలుగు, కన్నడ యాత్రీకులు

మానస సరోవర్‌లో భారీ వర్షాలు..చిక్కుకుపోయిన తెలుగు, కన్నడ యాత్రీకులు
x
Highlights

కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రకు వెళ్లిన భక్తులు గత రెండు రోజులుగా నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్‌ సేవలు నిలిచిపోవడంతో...

కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రకు వెళ్లిన భక్తులు గత రెండు రోజులుగా నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్‌ సేవలు నిలిచిపోవడంతో భారత్‌-నేపాల్‌ సరిహద్దులోని హిల్సా బేస్‌ క్యాంపులో భారీ సంఖ్యలో యాత్రికులు చిక్కుకున్నారు. అందులో వందమందికిపైగా తెలుగు వారు కూడా ఉన్నారు. ఆహారం కూడా దొరక్క యాత్రికులు అనారోగ్యంతో తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. గత నెల 27న మనససరోవర్‌ యాత్రకు వెళ్లామని, వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను వేడుకున్నారు. డబ్బులు కూడా అయిపోవడంతో యాత్రికులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.

తెలుగు యాత్రులకు సంబంధించి నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం ఢిల్లీలోని ఏపీ భవన్‌కు సమాచారం అందించింది. ఇటు, సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. మానస సరోవర్‌ యాత్రలో చిక్కుకున్న ఏపీకి చెందిన దాదాపు వందమంది యాత్రికులని క్షేమంగా స్వస్థలాలకు చేర్చే ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు ఏపీ భవన్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ను ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories