4జీ మాత్రమే కాదు.. 5జీలోనూ జియో సంచలనం!

4జీ మాత్రమే కాదు.. 5జీలోనూ జియో సంచలనం!
x
Highlights

జియో నెట్ వర్క్.. దేశాన్ని ఎంతగా ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జియో వచ్చాకే.. అట్టడుగు వర్గాలకూ.. అద్భుతమైన స్పీడ్ తో ఇంటర్ నెట్ సేవలు...

జియో నెట్ వర్క్.. దేశాన్ని ఎంతగా ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జియో వచ్చాకే.. అట్టడుగు వర్గాలకూ.. అద్భుతమైన స్పీడ్ తో ఇంటర్ నెట్ సేవలు అందడం మొదలైంది. జియో దెబ్బకు ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్ కూడా ధరలు తగ్గించి వినియోగదారులను తమ నెట్ వర్క్ వాడాలంటూ బతిమాలాల్సి వస్తోంది. ఇప్పడిప్పుడే ఇతర నెట్ వర్క్ లు.. జియో దెబ్బ నుంచి కొలుకుంటున్నాయంటే.. ఇన్నాళ్లూ జియో ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు.

అలాంటి జియో.. కేవలం మూడేళ్లలోనే దేశ వ్యాప్తంగా తమ నెట్ వర్క్ ను వ్యాపించినట్టు చెబుతోంది. త్వరలోనే కార్లు, ఇళ్లు, పారిశ్రామిక అవసరాలకూ.. తమ ఇంటర్ నెట్ సర్వీసులను అందించబోతున్నామని సంస్థ అధినేత ముఖేష్ అంబానీ చెప్పారు. తమ పిల్లలు.. ఈషా, ఆకాశ్.. యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని.. దేశంలో ఇంటర్ నెట్ వాడకం మరింత ముందుకు వెళ్లాలన్న తపన ఉన్నవాళ్లనీ చెబుతూ.. వారి కారణంగానే జియో ఈ స్థాయిలో ఉందని చెప్పుకొచ్చారు.

4జీతో సృష్టించిన ఈ సంచలనాన్ని.. ఇక్కడితో ఆపేది లేదని.. 5జీ టెక్నాలజీని కూడా దేశంలో విస్తృతంగా వ్యాప్తి చెందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇతర సంస్థలకు సవాల్ విసిరారు. దీంతో.. 4జీ కన్నా మరింత మెరుగైన 5జీ సేవలు అందుకునేందుకు భారతీయులు ఇప్పటినుంచే ఎదురుచూడడం మొదలు పెట్టారు. రిలయన్స్ చెబుతున్నట్టు.. అన్నీ కుదిరితే.. వచ్చే ఏడాదిలోపే 5జీ సేవలు కూడా మొదలయ్యే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories