విద్యుత్ వినియోగంలో దేశంలో తెలంగాణకు టాప్ ప్లేస్

x
Highlights

విద్యుత్ రంగంలో తెలంగాణ నంబర్ వన్ ప్లేస్ సంపాదించింది. దేశంలోనే అత్యధిక వినియోగం సాధించిణ రాష్ట్రంగా నిలిచింది. విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలో...

విద్యుత్ రంగంలో తెలంగాణ నంబర్ వన్ ప్లేస్ సంపాదించింది. దేశంలోనే అత్యధిక వినియోగం సాధించిణ రాష్ట్రంగా నిలిచింది. విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలో అత్యధిక వృద్ధిరేటును నమోదు చేయడంతో పాటు తలసరి వాడకంలోనూ ప్రథమ స్థానం సంపాదించింది.

2017-18 సంవత్సరానికి గాను విద్యుత్ రంగంలో వివిధ రాష్ట్రాలు సాధించిన పురోగతి వివరాలను కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ ప్రకటించింది. విద్యుత్ వినియోగంలో తెలంగాణ 13.62 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఇది దేశ సగటు వృద్ధి శాతమైన 6.11 కన్నా 122.91 శాతం అధికం. ఎక్కువ. ఇక విద్యుత్ వార్షిక వృద్ధి రేటులో పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ రెండో స్థానంలోనూ ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలోనూ నిలిచాయి. తెలంగాణ ఏర్పడక ముందు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ వినియోగంలో వార్షిక వృద్ధి రేటు సగటు 6 శాతంగా మాత్రమే ఉండేది.

ఏడాదికి వెయ్యి యూనిట్లకు పైగా తలసరి విద్యుత్ వినియోగం జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధికంగా 11.34 శాతం వృద్ధిరేటు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా తలసరి విద్యుత్ వినియోగం 2.4 శాతం మాత్రమే వృద్ధి సాధించింది. 2016-17 సంవత్సరంలో తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం ఒక వేయీ 551 యూనిట్లుంటే, 2017-18 సంవత్సరంలో అది ఇక వేయీ 727 యూనిట్లకు చేరింది. తలసరి విద్యుత్ వినియోగం ఆంధ్రప్రదేశ్ 5.23 శాతంతో రెండో స్థానంలోనూ...4.8 శాతంతో మహారాష్ట్ర మూడో స్థానంలో నిలిచాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తలసరి విద్యుత్ వినియోగం 59.32 శాతం పెరిగింది. 2013-2014లో తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 1,084 యూనిట్లు ఉండేది. అది 2017-18 సంవత్సరానికి 1727 యూనిట్లకు కు చేరింది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయడంతో పాటు, అన్ని రంగాలకు 24 గంటల నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం వల్లనే తెలంగాణ ఈ ఘనతను సాధించగలిగిందని ప్రభుత్వం అంటోంది. అలాగే వ్యవసాయ పంపుసెట్లకు కనెక్షన్లు ఇచ్చే విషయంలో కూడ తెలంగాణ రాష్ట్రం గణనీయమైన ప్రగతి సాధించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వ్యవసాయ కనెక్షన్ల మంజూరు విషయంలో నియంత్రణ ఉండేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ నియంత్రణను తొలగించారు. దీంతో తెలంగాణ ఏర్పడిన నాలుగేళ్లలోనే 4.28 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేశారు. విద్యుత్ వినియోగంలో తెలంగాణ ప్రధమ స్థానం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అతి తక్కువ వ్యవధిలోనే తెలంగాణ చిమ్మచికట్ల నుండి నిత్య వెలుగుల రాష్ట్రంగా మారిందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories