Top
logo

టీడీపీ వ్యూహం.. ఆ స్థానాలకు అభ్యర్థులు ఖరారు?

టీడీపీ వ్యూహం.. ఆ స్థానాలకు అభ్యర్థులు ఖరారు?
X
Highlights

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జోరు పెంచింది. పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం...

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జోరు పెంచింది. పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఎన్టీఆర్ భవన్‌లో పోలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్షులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై చర్చించారు. తెలంగాణ నేతలకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి స్థానాల్లో పార్టీ అభ్యర్థులను ఈ భేటీలో ఖరారు చేసినట్లు సమాచారం. కూకట్‌పల్లి స్థానాన్ని పెద్దిరెడ్డికి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. శెరిలింగంపల్లి స్థానంపై చంద్రబాబు నేతలకు సూచనలు చేశారు. భవ్య సిమెంట్స్‌ అధినేత ఆనంద్‌ప్రసాద్‌కు ఇవ్వాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి జరుగుతున్న సమావేశాల్లో మహాకూటమిలో సీట్ల సర్దుబాటు, ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై నేతలతో చర్చించారు.

Next Story