తెలంగాణలో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ

చలికాలం మొదలవుతూనే.. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. గత వారం రోజుల్లోనే.. పదుల సంఖ్యలో కేసులు నమోదవడం...
చలికాలం మొదలవుతూనే.. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. గత వారం రోజుల్లోనే.. పదుల సంఖ్యలో కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. చిన్న చిన్నగా మొదలైన కేసుల సంఖ్య.. భారీగా పెరగడంపై.. వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటివరకు ఒక్క మరణం లేకున్నా.. ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధమైంది. స్వైన్ ఫ్లూ పై అవగాహనతో పాటు.. ప్రభుత్వ దవాఖానాల్లో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణపై స్వైన్ ఫ్లూ సమరభేరి మోగించింది. గత ఆగస్టు చివరివరకు రాష్ట్రం యావత్తు.. 7 కేసులే నమోదవగా.. సెప్టెంబర్‌లో ఏకంగా కేసుల సంఖ్య 56 కు చేరింది. అలాగే అక్టోబర్ మొదటి వారంలో 53 నమూనాలు పరీక్షించగా.. అందులో 9 కేసులు.. పాజిటీవ్‌గా గుర్తించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 62 హచ్ 1 ఎన్ 1 కేసులు నమోదైనట్లు.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.
అయితే ఇప్పటివరకు గుర్తించిన కేసుల్లో అత్యధికంగా.. ప్రైవేటు ఆస్పత్రుల్లోనే నమోదయ్యాయి. చలిజ్వరంతో బాధపడుతూ ఆస్పత్రులకు వస్తున్నవారిలో ఎక్కువగా ఈ వైరస్ ఉన్నట్లు గుర్తిస్తున్నారు. దీంతో రోజురోజుకూ పెరుగుతున్న కేసులను అరికట్టేందుకు వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. స్వైన్ ఫ్లూ కారక హెచ్ 1 ఎన్ 1 వైరస్ ఉద్ధృతిని అడ్డుకోవడంపై.. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది.
వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో.. తక్షణ చర్యలకు సిద్ధమవుతున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను చికిత్సకు సంబంధించి సన్నద్ధం చేయడం.. మందులను అందుబాటులో ఉంచాలంటూ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే.. ఈ వ్యాధి ఎక్కువగా సోకే ప్రమాదం ఉన్న గర్భిణులు, చిన్న పిల్లలు, వృద్ధులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 37 ఆస్పత్రుల్లోని 467 పడకలను స్వైన్ ఫ్లూ రోగుల కోసం ముందస్తుగా సిద్ధం చేసినట్లు తెలిపారు.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT