logo

కాంగ్రెస్‌లో పెండింగ్ టెన్షన్

ఎట్టకేలకు 74 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ మిగిలిన స్థానాలను వ్యూహాత్మకంగానే జాప్యం చేస్తోంది. రెబెల్స్ బెడదను అధిగమించేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ ఎత్తుగడను అనుసరిస్తోంది. టికెట్ రాని నేతలకు ప్రత్యర్థి పార్టీలు గాలం వేయకుండా చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటించనుంది.

కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. 74 మందితో తొలి జాబితాను రెడీ చేసిన కాంగ్రెస్ పార్టీ 26 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. ఇక మిగిలిన స్థానాలపై మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రెబల్స్ బెడదను అధిగమించేందుకు ఈ ఎత్తుగడను అనుసరిస్తోందని తెలుస్తోంది.

అందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలో ధర్మపురి, రామగుండం, నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి, మెదక్ జిల్లాలో నారాయణ్‌ఖేడ్, పటాన్‌చెరు, వరంగల్ జిల్లాలో వరంగల్ వెస్ట్, మహబూబ్‌నగర్ జిల్లాలో మహబూబ్‌నగర్, దేవరకద్ర, నల్లగొండ జిల్లాలో దేవరకొండ, మిర్యాలగూడ, మునుగోడు స్థానాలపై ఎలాంటి నిర్ణ‍యం తీసుకోలేదు కాంగ్రెస్ హైకమాండ్.

ఇక ఖమ్మం జిల్లాలో ఇల్లెందు, భద్రాచలం, ఆశ్వారావుపేట, గ్రేటర్ హైదరాబాద్‌లో చాంద్రాయణగుట్టు, యాకుత్‌పురా, బహుదూర్ పురా, అంబర్‌పేట్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, కార్వాన్, చార్మినార్, రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్, మల్కాజ్‌గిరి, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల స్థానాలను పెండింగ్‌లో ఉంచింది కాంగ్రెస్ పార్టీ.

అయితే, ఈనెల 11, 12 తేదీల్లో కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో చర్చించిన తర్వాత ఈ స్థానాల్లో పార్టీ అభ్యర్ధులను ఖరారు చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కుంతియా తెలిపారు. ఇప్పటికే టిక్కెట్ లభించక అలకబూనిన నేతలను బుజ్జగిస్తున్న అధిష్టానం మరి ఈ పెండింగ్ స్థానాల్లో ఎవరెవరిని నియమిస్తుందో చూడాలి.

arun

arun

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top