ప్రముఖ కవి కపిలవాయి లింగమూర్తి కన్నుమూత

ప్రముఖ కవి కపిలవాయి లింగమూర్తి కన్నుమూత
x
Highlights

ప్రముఖ కవి, డాక్టర్ కపిలవాయి లింగమూర్తి హైదరాబాదులో మృతిచెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. నాగర్‌కర్నూల్...

ప్రముఖ కవి, డాక్టర్ కపిలవాయి లింగమూర్తి హైదరాబాదులో మృతిచెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. నాగర్‌కర్నూల్ బల్మూర్ మండలం జినుకుంటకు చెందిన కపిలవాయి లింగమూర్తి 1928 జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి లింగమూర్తి ఎం.ఏ.పట్టా పొంది 1954లో నాగర్‌కర్నూల్ జాతీయోద్యమ పాఠశాలలో తెలుగు పండితునిగా చేరారు. లింగమూర్తి నడిచే విజ్ఞానసర్వస్వంగా పేరుపొందాడు. పలుగ్రంథాలు, పరిశోధనలు చేసి సాహితీవేత్తగా పేరుపొందారు. కపిలవాయికి తెలుగు విశ్వవిద్యాలయం 2014లో గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో తెలుగు యూనివర్సిటీ నుంచి తొలి గౌరవ డాక్టరేట్ పొందిన వ్యక్తిగా కపిలవాయికి ఈ ఘనత దక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories