త్వరలోనే గ్రూప్-1 నోటిఫికేషన్

త్వరలోనే గ్రూప్-1 నోటిఫికేషన్
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎప్పడెప్పడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-1 నౌకరీల కోసం నిరంతరం పుస్తకాలకే పరిమితమై ప్రిపేర్ అవుతున్న విద్యార్ధులకు...

తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎప్పడెప్పడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-1 నౌకరీల కోసం నిరంతరం పుస్తకాలకే పరిమితమై ప్రిపేర్ అవుతున్న విద్యార్ధులకు ఎట్టకేలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చల్లటి కబురు అందించింది. ఇన్నిరోజులుగా జోన్ల విభజన కారణంగా నిలిచిపోయిన గ్రూప్ -1 నోటిఫికేషన్ ను త్వరలోనే విడుదల చేస్తామని పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ వాణి ప్రసాద్ వెల్లడించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడి నేటికి నాలుగేళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా వాణి ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటికి 38 వేల 59 పోస్టుల నియామకానికి ప్రభుత్వం అనుమతించిందని 101 నోటిఫికేషన్ల ద్వారా ఇప్పటి వరకు 16 వేల 50 పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. 20 వేల 260 పోస్టులకు సంబంధించి నియామక ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల 1877 పోస్టుల భర్తీ నిలిచిపోయిందని నేటి వరకు తెలంగాణ సర్కార్ నిర్వహించిన అన్ని పరీక్షలకు 34 లక్షల మంది హాజరయ్యారు. టీఆర్టీకి సంబంధించి ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే కోర్టు అనుమతితో ఫలితాలు విడుదల చేస్తామని ఆమె స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories