బీజేపీ నుంచి ఒకే ఒక్కడుగా రాజాసింగ్...

బీజేపీ నుంచి ఒకే ఒక్కడుగా రాజాసింగ్...
x
Highlights

తెలంగాణలో 118 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ కేవలం ఒక్కటంటే ఒక్క సీటు గెలిచింది. హేమాహేమీలు సైతం ఓటమి చవిచూశారు. కొందరు నేతల డిపాజిట్లు గల్లంతయ్యాయి....

తెలంగాణలో 118 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ కేవలం ఒక్కటంటే ఒక్క సీటు గెలిచింది. హేమాహేమీలు సైతం ఓటమి చవిచూశారు. కొందరు నేతల డిపాజిట్లు గల్లంతయ్యాయి. బీజేపీ జాతీయ నేతలు ప్రచారం చేసినప్పటికీ ప్రయోజనం చేకూరలేదు. భారతీయ జనతాపార్టీ తెలంగాణలో 119 స్థానాల్లో 118 స్థానాల్లో పోటీ చేసింది. యువ తెలంగాణ పార్టీకి ఒక సీటు కేటాయించింది. పోటీ చేసిన 118 స్థానాల్లో ఒకేలం గోషా మహల్ సీటును మాత్రమే దక్కించుకుంది. రాజాసింగ్ మాత్రమే ప్రత్యర్ధులను తట్టుకుని విజయం సాధించారు. ముషీరాబాద్‌లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఓటమి చవిచూశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ చేతిలో ఓడిపోయారు. ముషీరాబాద్‌లో నాయని నర్సింహారెడ్డి వర్గం ముఠా గోపాల్‌కు అండగా నిలిచి గెలుపు తీరాలకు చేర్చింది. అదే విధంగా కేటీఆర్‌ కూడా ఎన్నికలకు రెండు రోజుల ముందు చేసిన ప్రచారం కూడా ముఠా గోపాల్‌కు కలిసివచ్చింది. పార్టీలో కీలక నేతగా వెలుగొందుతూ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా భావింపబడే లక్షణ్ ఓటమి పార్టీకి గట్టి ఎదురుదెబ్బ వంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు.

అంబర్‌పేట్‌లో బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి కూడా ఓటమి చెందారు. టీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేష్ విజయం సాధించారు. గతంలో రెండు సార్లు అంబర్‌పేట్ నుంచి సునాయాశంగా విజయం సాధించిన కిషన్‌రెడ్డి ఈసారి కారు జోరును తట్టుకుని నిలబడలేకపోయారు. ఓటమిని చవిచూశారు. టీఆర్‌ఎస్ అభ్యర్ధి వెంకటేశ్‌ విస్తృతంగా ప్రచారం చేయడంతో కిషన్‌రెడ్డికి ఓటమి తప్పలేదు. తెలంగాణలోప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవీస్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, చివరకు స్వామి పరిపూర్ణానంద తదితరులు వచ్చి విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories