ఈసీ "సీ విజిల్‌" యాప్‌కు విశేష స్పందన..

x
Highlights

కేంద్ర ఎన్నికల కమిషన్‌ తొలిసారిగా ప్రవేశపెట్టిన ‘సి విజిల్‌’ యాప్‌కు తెలంగాణలో భారీ స్పందన లభిస్తోంది. తెలంగాణలో ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘనలకు...

కేంద్ర ఎన్నికల కమిషన్‌ తొలిసారిగా ప్రవేశపెట్టిన ‘సి విజిల్‌’ యాప్‌కు తెలంగాణలో భారీ స్పందన లభిస్తోంది. తెలంగాణలో ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘనలకు సంబంధించి రాతపూర్వక ఫిర్యాదులతో పాటు సి-విజల్‌ ద్వారానూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటివరకు సి-విజల్‌ ద్వారా 5291 ఫిర్యాదులు రాగా 69 శాతం పరిశీలనకు అనువైనవిగా గూర్తించారు రాష్ర్ట ఎన్నికల సంఘం అధికారులు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సి-విజిల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి డాక్టర్ రజత్ కుమార్ వెల్లడించారు. మొత్తం 5291 ఫిర్యాదులు రాగా 69 శాతం పరిశీలనకు అనువైనవిగా తేల్చి విచారణ జరిపామన్నారు. 188 ఫిర్యాదులు పెండింగులో ఉన్నాయని తెలిపారు.

సి-విజిల్ కు వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం అనుమతి లేకుండా ప్రదర్శించిన బ్యానర్లు, పోస్టర్లకు సంబంధించినవి ఉన్నాయి. వీటిలో 2210 ఫిర్యాదుల్లో 1829 కేసులను పరిష్కరించామని రజత్ కుమార్ వెల్లడించారు. గోడలు పాడుచేయడానికి సంబంధించి 141 ఫిర్యాదులు అందగా 103 కేసులు పరిష్కారించారు. మతపరమైన ప్రసంగాలు, సందేశాలకు సంబంధించి 43 ఫిర్యాదులు రాగా 22 కేసులను పరిష్కరించామని డబ్బు పంపిణీకి సంబంధించి 182 కేసులు నమోదు కాగా 41 కేసులను పరిష్కరించామన్నారు రజత్ కుమార్. మరో నాలుగు విచారణలో ఉన్నాయని తెలిపారు.

ఎన్నికల ర్యాలీలకు జనాన్ని తరలించడానికి సంబంధించి 96 ఫిర్యాదులకు 65 పరిష్కారం అయ్యాయని రజత్ కుమార్ తెలిపారు. అనుమతి లేని వాహనాలు, వాహనాలతో ఊరేగింపులకు సంబంధించి వచ్చిన 141 ఫిర్యాదుల్లో 91 పరిష్కారమయ్యాయనీ, 4 కేసులు విచారణలో ఉన్నాయని తెలిపారు. నిషేధిత సమయంలో ప్రచార నిర్వహణకు సంబంధించి నమోదైన 41 ఫిర్యాదులలో 26 కేసులను పరిష్కరించామనీ, ఆయుధాలు కలిగి ఉండడం, బెదిరింపులకు సంబంధించి మొత్తం 67 ఫిర్యాదుల్లో 43 పరిష్కారమయ్యాయన్నారు.

బహుమతులు,కూపన్ల పంపిణీకి సంబంధించి 111 ఫిర్యాదులు వచ్చాయని 44 పరిష్కరించామని మద్యం పంపిణీకి సంబంధించి ఒక ఫిర్యాదు పెండింగ్ లో ఉందన్నారు రజత్ కుమార్. చెల్లింపు వార్తలకు సంబంధించి 8 ఫిర్యాదులు, వివరాలు ప్రకటించను పోస్టర్లకు సంబంధించి 7, గడువు దాటిన స్పీకర్ల వినియోగానికి సంబంధించి ఒక ఫిర్యాదు పెండింగ్ లో ఉన్నట్లు చెప్పారు. ఇవిగాక ఇతర అంశాలకు సంబంధించి మొత్తం 1872 ఫిర్యాదులు రాగా 1223 కేసులను పరిష్కరించారు. మరో 57 పెండింగ్‌లో ఉన్నట్లు రాష్ర్ట ఎన్నికల సంఘం ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories