Top
logo

నాగం వస్తే గ్రూపు రాజకీయాలు పెరగడం ఖాయం

నాగం వస్తే గ్రూపు రాజకీయాలు పెరగడం ఖాయం
X
Highlights

నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే.. గ్రూపు రాజకీయాలు పెరగడం ఖాయం అని.. ఆ పార్టీ ఎమ్మెల్సీ కూచికుళ్ల...

నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే.. గ్రూపు రాజకీయాలు పెరగడం ఖాయం అని.. ఆ పార్టీ ఎమ్మెల్సీ కూచికుళ్ల దామోదర్ రెడ్డి అన్నారు. నాగం ను కాంగ్రెస్ లోకి తీసుకోవద్దని కోరుతామని స్పష్టం చేశారు. నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే.. అది పార్టీకే నష్టమని.. ఆయనో క్యాడర్ లేని లీడర్ అని విమర్శించారు. నాగం కాంగ్రెస్ లోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదన్న దామోదర్ రెడ్డి.. నాగంను నిలబెడితే ఓటమి ఖాయమని తేల్చిచెప్పారు. త్వరలోనే డీకే అరుణ, నంది ఎల్లయ్య, తానూ కలిసి ఢిల్లీకి వెళ్లి.. నాగం చేరికతో పార్టీకి కలిగే నష్టాలను రాహుల్ గాంధీకి వివరిస్తామన్నారు.

Next Story