తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల
x
Highlights

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు రంగం సిద్ధమయింది. డిసెంబరు ఏడో తేదీన జరిగే పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ...

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు రంగం సిద్ధమయింది. డిసెంబరు ఏడో తేదీన జరిగే పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల సంఘానికి సమచారం అందింది. దీంతో ఇవాల్టి నుంచి నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇవాల్టి నుంచి 19వ తేదీ వరకు నామినేషన్లు దాకలు చేయడానికి అవకాశం ఉంది. ఏడు రోజుల పాటు ఉదయం 11 నుంచి సాయంత్రం 3 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 20, 21 తేదీల్లో నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాలకు డిసెంబర్ 7న పోలింగ్ జరుగుతుంది. అదే నెల 11న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories