Top
logo

డిసెంబర్ 7న తెలంగాణ ఎన్నికలు

డిసెంబర్ 7న తెలంగాణ ఎన్నికలు
X
Highlights

ఈ ఏడాది డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఓపీ రావత్...

ఈ ఏడాది డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఓపీ రావత్ స్పష్టం చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మీడియాతో మాట్లాడారు. నాలుగు రాష్ర్టాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఓపీ రావత్.. తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్ 7న ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. డిసెంబర్ 11న కౌంటింగ్ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కాగా ఎన్నికల నిర్వహణ షెడ్యూల్‌ను హైకోర్టు తీర్పు తరవాతే ప్రకటిస్తామని, తెలంగాణలో ఓటర్ల జాబితాపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున ఓటర్ల జాబితా ప్రకటనకు సమయం పడుతుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ స్పష్టం చేశారు.

Next Story