శివుడి అవతారమెత్తిన తేజ్ ప్రతాప్ యాదవ్

RJD నేత తేజ్ ప్రతాప్ యాదవ్ శివుడి అవతారం ఎత్తారు. తేజ్ నయా లుక్ హాట్ టాపిక్ మారింది. గతంలో ఓ దళితుడి...
RJD నేత తేజ్ ప్రతాప్ యాదవ్ శివుడి అవతారం ఎత్తారు. తేజ్ నయా లుక్ హాట్ టాపిక్ మారింది. గతంలో ఓ దళితుడి ఇంటికి వెళ్లి స్నానం చేసి తనదైన మార్క్‌ను చాటుకున్న తేజ్ ఆ వెంటనే పెట్రోల్ ధరలకు నిరసనగా సైకిల్ యాత్ర చేపట్టారు. రీసెంట్‌గా శివుడి అవతారమెత్తడం చర్చనీయాంశంగా మారింది. పులి చర్మం ధరించి, మెడలో రుద్రాక్షలు, కమండలం, చెంబు చేతిలో పట్టుకుని అచ్చం శివుడి రూపంలో దర్శనమివ్వడం వైరల్‌గా మారింది.
పట్నాలో ఉన్న ఓ శివాలయానికి శివుడి వేషదారణలో వెళ్లడం హాట్‌టాపిక్‌గా మారింది. ఆలయానికి వెళ్లటం స్వయంగా ఆయనే పూజలు చేయటం, శంఖం పూరించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. తండ్రి ఆరోగ్యంగా ఉండాలని ఇలా శివాలయంలో ప్రత్యేక పూజలు చేశానన్నారు. తేజ్ శివుడిపై ఉన్న భక్తితోనే ఇలా చేశానంటున్నారు.
శివుడి వేషధారణలో ఉన్న తేజ్ పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ మధ్య చాలా యాక్టివ్ గా ఉంటున్నారని ప్రశంసిస్తుండగా ఇదేం అవతారం అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఎవరి వెర్షన్ ఎలా ఉన్నా తండ్రికి తగ్గ తనయుడే అంటున్నారు అందరూ. లాలూ కంటే ఓ అడుగు ముందుకేసి ప్రచారంలో దూసుకుపోతున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
Invest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMTKidney Stone: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా.. అసలు విషయం...
12 Aug 2022 1:30 PM GMTRajagopal Reddy: నా త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరుగుతోంది..
12 Aug 2022 1:00 PM GMTమునుగోడులో బీజేపీదే విజయం: డా.లక్ష్మణ్
12 Aug 2022 12:45 PM GMT