Top
logo

శ్రీలంకను చిత్తు చేసిన భారత్..!

Highlights

శ్రీలంకతో తీన్మార్ టెస్ట్ సిరీస్ రెండోమ్యాచ్ లో...ఆతిథ్య టీమిండియా ఇన్నింగ్స్ విజయంతో 1-0 ఆధిక్యం...

శ్రీలంకతో తీన్మార్ టెస్ట్ సిరీస్ రెండోమ్యాచ్ లో...ఆతిథ్య టీమిండియా ఇన్నింగ్స్ విజయంతో 1-0 ఆధిక్యం సంపాదించింది. నాగపూర్ విదర్భ క్రికెట్ స్టేడియం వేదికగా ముగిసిన తొలిటెస్ట్ నాలుగోరోజుఆటలోనే టాప్ ర్యాంకర్ టీమిండియా ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. భారీతొలిఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ను ఓవర్ నైట్ స్కోరుతో ప్రారంభించిన శ్రీలంక...నాలుగోరోజుఆట ప్రారంభం నుంచే వరుసగా వికెట్లు కోల్పోతూ ఇన్నింగ్స్ ఓటమి ఊబిలో చిక్కుకొంది. కెప్టెన్ దినేశ్ చండీమల్ ఒక్కడే పోరాడి ఫైటింగ్ హాఫ్ సెంచరీ సాధించినా...టీమిండియా బౌలర్లను నిలువరించలేకపోయాడు. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ 4, ఇశాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జడేజా తలో రెండు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుత సీజన్ శ్రీలంక సిరీస్ లో...ఇన్నింగ్స్ విజయాలతో సిరీస్ స్వీప్ సాధించిన టీమిండియా....కోల్ కతా టెస్టులో సైతం విజయం అంచుల వరకూ వచ్చి డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే నాగపూర్ టెస్టులో మాత్రం ఆల్ రౌండ్ షోతో శ్రీలంకను ఊదిపారేసింది. సిరీస్ లోని ఆఖరి టెస్ట్ న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా డిసెంబర్ 2న ప్రారంభమవుతుంది..

Next Story