Top
logo

రాహుల్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే

రాహుల్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే
X
Highlights

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో టీడీపీ ఎమ్మెల్యే, బీసీ నాయకుడు ఆర్‌.కృష్ణయ్య మంగళవారం నాడు...

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో టీడీపీ ఎమ్మెల్యే, బీసీ నాయకుడు ఆర్‌.కృష్ణయ్య మంగళవారం నాడు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత లేదని ఆర్. కృష్ణయ్య ప్రకటించారు. దాదాపు మూడు గంటల పాటు రాహుల్‌‌తోనే ఆర్‌.కృష్ణయ్య కలిసి తిరిగారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ప్రజా చైతన్య బస్సులోకి ఎక్కి వారితో ప్రయాణం చేశారు. ఆర్‌.కృష్ణయ్యను బస్సులోకి కుంతియా ఆహ్వానించారు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం రాహుల్‌ను కలిశానని ఆర్‌.కృష్ణయ్య స్పష్టం చేశారు. తెలంగాణలోని ఎల్బీనగర్ నుండి టీడీపీ నుండి గత ఎన్నికల్లో ఆర్. కృష్ణయ్య విజయం సాధించారు.

Next Story