కరుణానిధి ఆరోగ్యంపై వైద్యులు హెల్త్‌ బులిటెన్‌

కరుణానిధి ఆరోగ్యంపై వైద్యులు హెల్త్‌ బులిటెన్‌
x
Highlights

డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యంపై వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని, పరిస్థితి అదుపులోనే...

డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యంపై వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని, పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.కరుణానిధి ఆరోగ్యంపై వదంతులు నమ్మొద్దని, ఆయన క్రమంగా కోలుకుంటున్నారంటూ కరుణ కుమర్తె కనిమొళి తెలిపారు. గత కొంతకాలంగా వయసురీత్యా సమస్యలతో కరుణానిధి(94) బాధపడుతున్నారు. గొంతులో అమర్చిన ట్రాకియాస్టమీ ట్యూబ్‌ మార్పిడి కారణంగా కరుణకు స్వల్పంగా జ్వరం, ఆపై ఇన్ఫెక్షన్‌ సోకింది. దీంతో గోపాలపురంలోని ఆయన ఇంటిలోనే శుక్రవారం వైద్యులు చికిత్స అందించారు. ఇదిలావుంటే కరుణానిధి చిన్నకుమారుడు డీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్షనేత స్టాలిన్ పార్టీ ఎమ్మెల్యేతో అత్యవసర భేటీ అయ్యారు. కరుణానిధి ఆరోగ్యంపై నెలకొన్న ఆందోళన నేపథ్యంలో ఎమ్మెల్యేలతో చర్చించేందుకు స్టాలిన్ వారితో సమావేశం అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories