పరువు హత్య...ప్రాణం ఉండగానే కాళ్లు చేతులు కట్టేసి నదిలో పడేశారు

కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెపై కక్ష పెంచుకున్న తల్లిదండ్రులు ఆమెతోపాటు అల్లుణ్ని కూడా అత్యంత పాశవికంగా...
కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెపై కక్ష పెంచుకున్న తల్లిదండ్రులు ఆమెతోపాటు అల్లుణ్ని కూడా అత్యంత పాశవికంగా హత్య చేశారు. తక్కువ కులం అబ్బాయిని పెళ్లిచేసుకుని తమ పరువు తీసిందని భావించిన అమ్మాయి కుటుంబసభ్యులు ఇద్దర్నీ కావేరీ నదిలో తోసేసి హత్య చేశారు. అత్యంత కిరాతమైన ఈ ఘటన గతవారం కర్ణాటక- తమిళనాడు సరిహద్దుల్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తమిళనాడు కృష్ణగిరి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన నందీష్(26), స్వాతి(19) గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి కులాలు వేరు కావడంతో నందీష్, స్వాతి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో మూడు నెలల క్రితం నందీష్, స్వాతి ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఇక తమిళనాడులో ఉండకుండా కర్ణాటకలోని మాండ్యా పోలీసు స్టేషన్ పరిధిలో నవ దంపతులు ఉంటున్నారు. అయితే కమల్ హాసన్ మీటింగ్ నవంబర్ 10న హోసూర్(తమిళనాడు)లో ఉండడంతో నందీష్, స్వాతి అక్కడికి వెళ్లారు. ఇక్కడ స్వాతి దూరపు బంధువు వీరిని చూసి ఆమె తండ్రికి సమాచారం అందించాడు. అప్పటికే హోసూర్‌లో ఉన్న స్వాతి తండ్రి తన బంధువులతో అక్కడికి చేరుకొని నవ దంపతులను పట్టుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మొత్తానికి నవంబర్ 11న తెల్లవారుజామున 3 గంటల సమయంలో నందీష్, స్వాతి కాళ్లు, చేతులు కట్టేసి శివణసముద్ర వద్ద కావేరీ నదిలో తోసేశారు. అయితే రెండు రోజుల తర్వాత వీరి మృతదేహాలు నీటిపై తేలియాడడంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగు చూసింది. నిందితుడు శ్రీనివాస్(స్వాతి తండ్రి)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేరాన్ని తానే చేసినట్లు శ్రీనివాస్ పోలీసుల ఎదుట అంగీకరించాడు.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
Baby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMTKidney Stone: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా.. అసలు విషయం...
12 Aug 2022 1:30 PM GMTRajagopal Reddy: నా త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరుగుతోంది..
12 Aug 2022 1:00 PM GMT