తమిళ సినీ నిర్మాతల సంఘంలో ముదిరిన వివాదం...పరిస్థితి అదుపు తప్పడంతో... రంగంలోకి...

తమిళ సినీ నిర్మాతల సంఘంలో చెలరేగిన వివాదం మరింత ముదిరింది. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు చిన్న నిర్మాతలు తాళం...
తమిళ సినీ నిర్మాతల సంఘంలో చెలరేగిన వివాదం మరింత ముదిరింది. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు చిన్న నిర్మాతలు తాళం వేసి ఆందోళనకు దిగడంతో సమస్య తీవ్ర రూపం దాల్చింది. అయితే తాళం పగులగొట్టి కార్యాలయంలోకి వెళ్లేందుకు విశాల్ ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో విశాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
తమిళ సినీ నిర్మాతల సంఘంలో చెలరేగిన వివాదం రోజురోజుకీ ముదురుతోంది. విశాల్‌కి వ్యతిరేకంగా దాదాపు 50మంది చిన్న నిర్మాతలు చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చింది. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ చిన్న నిర్మాతలను విశాల్ ఇబ్బంది పెడుతున్నాడంటూ టీనగర్‌లోని నిర్మాతల మండలి కార్యాలయానికి తాళం వేయడంతో వివాదం మరింత ముదిరింది. అయితే కార్యాలయానికి వేసిన తాళాన్ని విశాల్ పగలగొట్టేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విశాల్‌ను చిన్న నిర్మాతలు అడ్డుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. దాంతో విశాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్ష పదవికి విశాల్ రాజీనామా చేయాలంటోన్న చిన్న నిర్మాతలు ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దుచేసి, మళ్లీ ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. విశాల్‌పై మండిపడుతోన్న పలువురు ప్రొడ్యూసర్స్ సినిమాల విడుదలలో పక్షపాతం చూపిస్తున్నాడని, అలాగే పైరసీకి అడ్డుకట్ట వేయడంలో విఫలమయ్యాడని, పైగా పైరసీ వెబ్‌సైట్ తమిళ రాకర్స్‌లో విశాల్‌కు వాటా ఉందని, నిర్మాతల మండలి ఆర్ధిక లావాదేవీల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు.
అయితే తానూ ఏ తప్పూ చేయలేదని, తన కార్యాలయంలోకి ఎందుకు వెళ్లనివ్వరంటూ విశాల్ ప్రశ్నిస్తున్నాడు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఇలా పోలీసులతో అరెస్ట్ చేయిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిన్నటివరకూ ఏమీ మాట్లాడని పోలీసులు ఇప్పుడు నన్నూ నా సహోద్యోగులను అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. మా తప్పేం లేకపోయినా తమపై చర్యలు తీసుకున్నారు ఇది ఎంతవరకు న్యాయమంటూ ప్రశ్నించారు. పోలీసుల తీరుపై పోరాటం చేస్తామని విశాల్ ప్రకటించారు. మొత్తానికి తమిళ సినీ నిర్మాతల సంఘంలో చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. మరి విశాల్ అరెస్ట్ ఎపిసోడ్‌తో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
Police who were mute yesterday wen unauthorised ppl locked the doors & gates of TFPC have arrested me & my colleague today for no fault of ours,absolutely unbelievable
— Vishal (@VishalKOfficial) December 20, 2018
We will fight back,wil do everything to conduct Ilayaraja sir event & raise funds to help Producers in distress
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
Karan Johar: కరణ్ జోహార్ పార్టీలో కానరాని టాలీవుడ్ సెలబ్రిటీలు
26 May 2022 4:00 PM GMTPersonal Loan: స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. లక్ష రూపాయల వరకు రుణ...
26 May 2022 3:30 PM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTClove Oil: లవంగం నూనెతో పురుషులకి బోలెడు లభాలు.. తెలిస్తే షాక్...
26 May 2022 2:30 PM GMTసల్మాన్ ఖాన్ రీమేక్ సినిమాకి నో చెప్పిన తరుణ్ భాస్కర్
26 May 2022 1:30 PM GMT