పది మంది ప్రాణాలు కాపాడిన ఫుడ్‌ డెలివరీ బాయ్‌

పది మంది ప్రాణాలు కాపాడిన ఫుడ్‌ డెలివరీ బాయ్‌
x
Highlights

తాజాగా ముంబయిలోని ఓ సర్కారు దవాఖనాలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలసిందే అంధేనిలోని ఈఎస్‌ఐసీ కామ్‌గార్‌ ఆసుపత్రిలో చోటుచేసుకున్న అగ్ని...

తాజాగా ముంబయిలోని ఓ సర్కారు దవాఖనాలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలసిందే అంధేనిలోని ఈఎస్‌ఐసీ కామ్‌గార్‌ ఆసుపత్రిలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఓ ఫుడ్ డెలివరీ బాయ్ ఈ ప్రమాదం నుండి ఏకంగా పది మంది ప్రాణాలను కాపాడారు. ప్రమాదం జరిగిన రోజు ఫుడ్‌ డెలివరీ బాయ్‌ సిద్ధు(20) అటుగా వెళ్తూ అగ్ని ప్రమాద దృశ్యాలను చూసి హుటాహుటినా ఫైర్ సిబ్బందితో కలిసి తానుకూడా సహాయక చర్యల్లో దాదాపు రెండు గంటలపాటు శ్రమించి ఎట్టకేలకు పదిమంది ప్రాణాలను కాపాడారు. కాగా అదే సమయంలో దట్టమైన పొగ వల్ల సిద్ధు కొంత అనారోగ్యానికి గురై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అనంతరం ఆసుపత్రిలో సిద్ధు మీడియాతో మాట్లాడుతూ తమను కాపాడామంటూ ఆస్పత్రిలో నుంచి పెషేంట్‌లు కేకలు వేయటంతో అగ్ని మాపక సిబ్బందితో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నని అక్కడఉన్న గొడ్డలితో బిల్డింగ్‌ అద్దాలను పగులగొట్టి ఆస్పత్రిలోనికి దూరి నిచ్చెనతో పెషెంట్‌లను కిందకు దించాను. అయితే ఈ ప్రమాదంలో గాయాపడిన బాధితులను పరామర్శించడానికి వచ్చిన కేంద్ర మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ నా యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నార’ని సిద్ధు వెల్లడించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories