logo

అన్నపూర్ణ స్టూడియోలో అనుమానాస్పద మృతి

అన్నపూర్ణ స్టూడియోలో అనుమానాస్పద మృతి
Highlights

హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో పని చేస్తున్న నారాయణరెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు....

హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో పని చేస్తున్న నారాయణరెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన వయసు 53 ఏళ్లు. అయితే, ఆయన మృతదేహాన్ని స్టూడియో సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బంధువులకు సైతం సమాచారం ఇవ్వకుండా డెడ్ బాడీని తరలించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా హత్య చేసి ఉండవచ్చునని నారాయణరెడ్డి బంధువులు భావిస్తున్నారు. అయితే తమకు సమాచారం ఇవ్వకపోవడాన్ని వారు తప్పు పడుతూ ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. అటు-సమాచారం అందుకున్న పోలీసులు అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.

లైవ్ టీవి

Share it
Top