Top
logo

జగన్ బయోపిక్.. హీరో పాత్రలో సూర్య..

జగన్ బయోపిక్.. హీరో పాత్రలో సూర్య..
X
Highlights

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బయోపిక్ ల కాలం సాగుతోంది. ఎన్టీఆర్ బయోపిక్ కు రంగం సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే....

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బయోపిక్ ల కాలం సాగుతోంది. ఎన్టీఆర్ బయోపిక్ కు రంగం సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. మరో వైపు దివంగత నేత వైఎస్ఆర్ బయోపిక్ కు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మలయాళీ నటుడు మమ్ముట్టిని వైఎస్ పాత్రలో నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతలోనే మరో ఆశ్చర్యకరమైన ప్రచారం జోరందుకుంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద సినిమా తియ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సోషల్ మీడియా తెగ కూసేస్తోంది. జగన్ బయోపిక్ కి పూనుకున్నదెవ్వరు..? ఎప్పుడు ఎక్కడ మొదలవుతుందన్న వివరాల కంటే ముందు.. యువనేత జగన్ పాత్ర ఎవరు వేయబోతున్నారన్న ముచ్చట మాత్రమే హల్చల్ చేస్తోంది. జగన్ పాత్రలో తమిళ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్నారన్నది తాజా షాకింగ్ ‘న్యూస్’.

జగన్ తో సూర్యకు సాన్నిహిత్యం ఉండడం, జగన్ భాగస్వామ్యం వున్న భారతీ సిమెంట్స్ కి సూర్య బ్రాండ్ అంబాసిడర్ కావడం.. లాంటి బేసిక్స్ ఆధారంగా సూర్య పేరు బలంగా వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో జగన్ కరిష్మాకు తోడయ్యేలా వైసీపీ సానుభూతిపరుడొకరు ఈ ‘బయోపిక్’ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ బాడీ లాంగ్వేజ్ కి బాగా సింకయ్యే సూర్య ఈ బయోపిక్ కి ఓకె అయితే.. వైసీపీ ఫ్యాన్స్ కి పండగే మరి.

Next Story