logo
జాతీయం

అయోధ్యపై సుప్రీం కీలక తీర్పు

అయోధ్యపై సుప్రీం కీలక తీర్పు
X
Highlights

అయోధ్య రామ జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు కాసేపట్లో కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసు విచారణను...

అయోధ్య రామ జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు కాసేపట్లో కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసు విచారణను ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి అప్పగించడానికి త్రిసభ్య ధర్మాసనం నిరాకరించింది. ఈ మేరకు 2:1 మెజార్టీతో ముగ్గురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అయోధ్య భూ యాజమాన్య హక్కులపై అక్టోబర్ 29 న విచారణ జరుపుతామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. అలాగే ఇస్లాంలో మసీదులు అంతర్భాగమా అన్న అంశాన్ని కూడా విస్తృత ధర్మాసనానికి బదలాయించడానికి త్రిసభ్య ధర్మాపనం నిరాకరించింది. మసీదు ఇస్లాంలో అంతర్భాగం కాదంటూ 1994 లో ఇస్మాయిల్ ఫారూఖీ కేసులో ఇచ్చిన తీర్పును సమర్ధించింది. మతాలలో ప్రార్థనా స్థలాలకు ప్రత్యేక స్థానం ఉందన్న అత్యున్నత న్యాయస్థానం అన్ని మతాలు సమానమేనని వ్యాఖ్యానించింది.

Next Story