కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా సునీల్‌ అరోరా

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా సునీల్‌ అరోరా
x
Highlights

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ గా సునీల్‌ అరోరా నియమితులయ్యారు. ప్రస్తుతం చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా ఉన్న ఓం ప్రకాష్‌ రావత్‌ తర్వాత సీఈసీగా...

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ గా సునీల్‌ అరోరా నియమితులయ్యారు. ప్రస్తుతం చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా ఉన్న ఓం ప్రకాష్‌ రావత్‌ తర్వాత సీఈసీగా సునీల్‌ ఆరోరాను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఓపీ రావత్‌ పదవీకాలం డిసెంబర్‌ 2 వ తేదీన ముగుస్తుండటంతో అదే రోజు నూతన సీఈసీగా మాజీ ఐఏఎస్‌ అధికారి ఆరోరా బాధ్యతలు స్వీకరించనున్నారు. 1980 బ్యాచ్‌కు చెందిన రాజస్థాన్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన అరోరా దాదాపు రెండున్నరేళ్ల పాటు సీఈసీగా కొనసాగుతారు. ఈయన హయాంలోనే కీలకమైన 2019 ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిన ఓపీ రావత్‌ అవి ముగియకముందే.. రిటైర్‌ అవబోతున్నారు. గతంలో ఓపీ రావత్‌, సునీల్‌ కొన్నిరోజుల పాటు ఎన్నికల కమిషనర్లుగా వ్యవహరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories