సునంద పుష్కర్ మృతి కేసులో చార్జ్ షీట్ దాఖలు

సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో ఆమె భర్త, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్‌పై చార్జి షీట్ దాఖలైంది....
సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో ఆమె భర్త, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్‌పై చార్జి షీట్ దాఖలైంది. ఢిల్లీలోని పాటియాలా కోర్టులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. 306, 498ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సునందా పుష్కర్ మృతి కేసు విచారణను ఈ నెల 24కు కోర్టు వాయిదా వేసింది. సునందను ఆత్మహత్యకు ప్రేరేపించారని శశిథరూర్‌పై ఛార్జిషీట్‌లో ఆరోపించారు.
2014, జనవరి 17న ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ లోని తన గదిలో సునంద పుష్కర్ శవమై పడి ఉండగా గుర్తించారు. ఆమె మృతికి విష ప్రయోగం, మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకోవడం కారణమని తదితర అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఐతే, సునంద పుష్కర్ ఆత్మహత్య చేసుకొందని పోలీసులు నిర్ధారించారు. ఇది హత్య కాదని చార్జీషీటులో పోలీసులు అభిప్రాయపడ్డారు. సునందను ఆత్మహత్యకు ప్రేరేపించారని చార్జిషీట్ లో పోలీసులు శశి థరూర్ పై ఆరోపణ నమోదు చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని దాదాపు నిర్ధారణ అయ్యింది.
జనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMTSinkhole: భారీగా పెరుగుతున్న వింత గొయ్యి లోతు..
9 Aug 2022 3:00 PM GMT
కామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTఇవాళ తెలంగాణ మంత్రివర్గం సమావేశం
11 Aug 2022 2:16 AM GMTఇవాళ గాంధీభవన్‌లో రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం
11 Aug 2022 1:46 AM GMTకేసీఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం
11 Aug 2022 1:06 AM GMTనుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట
10 Aug 2022 4:00 PM GMT