సుడిగాలి సుధీర్ ఆ అమ్మాయిని తల్చుకుంటూ ఏడ్చేశాడు!

సుడిగాలి సుధీర్ ఆ అమ్మాయిని తల్చుకుంటూ ఏడ్చేశాడు!
x
Highlights

బుల్లితెరపై యాంకర్ గా సుధీర్ కి మంచి క్రేజ్ వుంది. 'జబర్దస్త్' కార్యక్రమంలో 'సుడిగాలి సుధీర్' గా మంచి మార్కులు కొట్టేసిన సుధీర్, 'ఢీ' డాన్స్ షోలోను...

బుల్లితెరపై యాంకర్ గా సుధీర్ కి మంచి క్రేజ్ వుంది. 'జబర్దస్త్' కార్యక్రమంలో 'సుడిగాలి సుధీర్' గా మంచి మార్కులు కొట్టేసిన సుధీర్, 'ఢీ' డాన్స్ షోలోను యాంకర్ గా సందడి చేస్తూ ఉంటాడు. టీవీ రంగానికి రాక మునుపు .. నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందు సుధీర్ మ్యాజిక్ చేసేవాడు. ప్రొఫెషనల్ మెజీషియన్ గా ఆయన కొంతకాలం పాటు ప్రదర్శనలు ఇచ్చాడు.'జబర్దస్త్' షోతో బుల్లితెరపై అల్లరి చేసే సుడిగాలి సుధీర్ ఇటీవల ఓ టీవీషోలో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా యాంకర్ అడిగిన ప్రశ్నకు తన ప్రేమను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యాడు. స్టేజ్ మీద ఏడ్చేసిన సుధీర్ ని మంచు లక్ష్మీ ఓదార్చే ప్రయత్నం చేసింది. అసలు విషయంలోకి వస్తే.. సుడిగాలి సుధీర్ 12 ఏళ్ల పాటు ఓ అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమించాడట.

కానీ అమ్మాయి అతడిని వదిలేసి మరెవరినో పెళ్లి చేసుకోవడంతో ఆ బాధ నుండి రావడానికి చాలా సమయం పట్టిందని తన లవ్ స్టోరీ చెప్పుకొచ్చాడు. 'ఐదో తరగతి చదివే సమయంలో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. తొమ్మిదో తరగతి వచ్చేసరికి తను కూడా నన్ను ఇష్టపడింది. అలా పన్నెండేళ్ల పాటు మా ప్రేమ కొనసాగింది. నేను హైదరాబాద్ కి వెళ్తున్నాను సెటిల్ అయి వస్తాను అని ఆ అమ్మాయికి చెప్పి వచ్చాను. తను కూడా నీకోసం ఎదురుచూస్తుంటానని చెప్పి పంపించింది. కానీ సడెన్ గా ఒకరోజు ఫ్రెండ్ ఫోన్ చేసి ఆ అమ్మాయికి పెళ్లైంది లవ్ మ్యారేజ్ అంట అని చెప్పాడు. నేను ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఇలా ఎందుకు చేశావని అడిగితే నేను చాలా సంతోషంగా ఉన్నాను.. నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పింది' అంటూ చిన్నప్పటి తన ప్రేమ విఫలమైందని కన్నీటి పర్యంతమయ్యాడు. అతడితో పాటు ఆ షోలో పాల్గొన్న ప్రియమణి, మంచు లక్ష్మీ అతడిని ఓదార్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories