హల్ చల్ చేస్తున్న సైరా నరసింహారెడ్డి

Highlights

ఫ్రీ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేసుకున్న చిరంజీవి సైరా నరసింహారెడ్డి డిసెంబర్ 6నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా యోధుడు...

ఫ్రీ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేసుకున్న చిరంజీవి సైరా నరసింహారెడ్డి డిసెంబర్ 6నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు కరెక్ట్ గా సెట్ అయ్యేలా మెగాస్టార్ తన బాడీ షేప్ ను మార్చుకుని అంచనాల్ని భారీగా పెంచేశాడు. ఫిట్‌నెస్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెడుతూ జిమ్‌లో గంట‌ల త‌ర‌బ‌డి క‌స‌రత్తులు చేశాడు. ఆరు పదుల వయసు దాటినా కూడా మెగా స్టార్ ఒక యోధుడు అనే భావన కలిగేలా రీసెంట్ గా సోషల్ మీడియాలో విడుదలైన చిరంజీవి ఫోటోలు విడుదలయ్యాయి. అయితే ఈ ఫోటోలు చూసిన సినీ జనాలు ఈ సినిమా కోసం చిరు ఎంత కష్టపడతున్నాడో..ప్రతీ ఫ్రేమ్ లో అర్ధం చేసుకోవచ్చని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సినిమా విడుదల తరువాత చిరంజీవి క్రేజ్ మరింత పెరుగుతుందని అంటున్నారు.

కాగా భారీ బడ్జెట్ చిత్రం పీరియాడియకల్ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ 1840 నాటి కథకి తగ్గట్టుగా ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన ఒక సెట్ లో భారీ సెట్ నిర్మించాడు. ఇదిలా ఉంటే సైరా కోసం చిరంజీవితో పాటు యాక్ట్ చేసేందుకు అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చా సుదీప్, నయనతార, విజయ్ సేతుపతులు కూడా సిద్ధమయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories