Top
logo

మొబైల్‌ పోయిందని విద్యార్థిని ఆత్మహత్య

మొబైల్‌ పోయిందని విద్యార్థిని ఆత్మహత్య
X
Highlights

నాన్న కొనిచ్చిన సెల్ ఫోన్ పోయిందని టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కర్ణాటక మైసూర్‌లో ఈ ఘటన చోటు...

నాన్న కొనిచ్చిన సెల్ ఫోన్ పోయిందని టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కర్ణాటక మైసూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని గాంధీనగర్‌కు చెందిన నిఖిత (16) గాయత్రిపురంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. బుధవారం సాయంత్రం సోదరుడు బబ్లూతో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం నిఖిత సెల్‌ఫోన్‌ కనిపించలేదు. నాన్న ఎంతో ప్రేమగా ఇచ్చిన ఫోన్‌ కనిపించకపోవడంతో నిఖిత గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో తమ కూతురు బలవన్మరణానికి పాల్పడటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎన్‌ఆర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Next Story