మహంకాళి ఆలయం ముందు మహిళలపై వీరంగం

x
Highlights

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం ముందు పూల వ్యాపారుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరో వ్యక్తిని కింద పడేసి కొట్టాడు. దీంతో సదరు వ్యక్తిని...

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం ముందు పూల వ్యాపారుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరో వ్యక్తిని కింద పడేసి కొట్టాడు. దీంతో సదరు వ్యక్తిని అడ్డుకోబోయిన మరో ఇద్దరు మహిళలను కూడా తీవ్రంగా చితకబాదాడు. ఇరు వర్గాల మహిళలు కూడా కొట్టుకున్నారు. ఈ గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆలయం ముందు జరిగిన ఈ కొట్లాటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో అర్ధనగ్నంగా ఉన్న ఓ యువకుడు వీరంగం వేశాడు. ప్రత్యర్థి యువకుడిని కిందపడేసి చితకబాదడమే కాదు.. మహిళలని చూడకుండా కిరాతకంగా దాడి చేశాడు. మహిళలను కర్రతో చితకబాదడమే కాకుండా.. వారిపై ఎగిరిదూకి సినిమా తరహాలో స్టంట్‌లు చూశాడు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ప్రభావం ఆ యువకుడిపై కనిపిస్తోందని, మహిళలను కిరాతకంగా కొడుతున్నా.. చుట్టూ ఉన్నవారు వినోదం చూస్తున్నారే తప్ప.. ఎవరూ ఎందుకు స్పందించలేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories