logo

మీడియా సమావేశంలో స్టీవ్ స్మిత్ కన్నీరుమున్నీరు

మీడియా సమావేశంలో స్టీవ్ స్మిత్ కన్నీరుమున్నీరు

క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన బాల్ టాంపరింగ్ వివాదం ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ను సైతం మానసికంగా కృంగదీసింది. కేప్ టౌన్ టెస్టులో చోటు చేసుకొన్న పరిణామాలకు తన నాయకత్వలోపమే కారణమని సిడ్నీలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పాడు. ఈ తప్పుకు తానే కారణమని, తన కారణంగా తమజట్టు భారీమూల్యం చెల్లించాల్సి వచ్చిందని ఈ పొరపాటు తనను జీవితకాలం వెంటాడుతూనే ఉంటుందని స్మిత్ విలపిస్తూ చెప్పాడు. ఓ దశలో స్టీవ్ స్మిత్ భావోద్వేగాలను అదుపు చేసుకోలేక కన్నీరుమున్నీరయ్యాడు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ నంబర్ వన్ బ్యాట్స్ మన్ గా ఉన్న స్మిత్ పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది నిషేధం విధించడంతో ఐపీఎల్ లీగ్ లో ఆడే అవకాశంతో పాటు 12 కోట్ల రూపాయల కాంట్రాక్టును సైతం స్మిత్ పోగొట్టుకోవాల్సి వచ్చింది. జట్టు సభ్యులు, ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు, ఆస్ట్రేలియా ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. తాను చేసిన తప్పుకు చింతిస్తున్నానని తనను మన్నించాలని వేడుకొన్నాడు.

arun

arun

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top