logo
సినిమా

స్టార్ మ‌హిళ కార్య‌క్ర‌మానికి పులిస్టాప్ పెట్టిన సుమ‌

స్టార్ మ‌హిళ కార్య‌క్ర‌మానికి పులిస్టాప్ పెట్టిన సుమ‌
X
Highlights

బుల్లితెరపై యాంకర్లు అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు సుమ. తన సరదా మాటలు, ముచ్చట్లతో ఆమె ఎంతో మంది అభిమానులను...

బుల్లితెరపై యాంకర్లు అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు సుమ. తన సరదా మాటలు, ముచ్చట్లతో ఆమె ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అందుకే చాలా టెలివిజన్‌ ఛానళ్లు ఆమెను వ్యాఖ్యాతగా తీసుకుంటాయి. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన షోలలో చాలా పాపులర్ అయిన కార్యక్రమం ‘స్టార్‌ మహిళ’. 12 ఏళ్లుగా నిరంతరాయంగా సాగుతూ దాదాపు 3000లకు పైగా ఎపిసోడ్లను పూర్తిచేసుకుంది. అతిపెద్ద టీవీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సుమకు ‘లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోనూ చోటుదక్కింది. అయితే ఇప్పుడు ‘స్టార్‌ మహిళ’ కార్యక్రమానికి తెరపడనుంది. ఈ కార్యక్రమం త్వరలో ముగియనున్నట్లు సుమ ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మాన్ని ఇన్నాళ్లుగా ఆద‌రించినందుకు కృత‌జ్ఞ‌తలు తెలిపింది. ప్రపంచంలో ఏది శాశ్వ‌తం కాదు. ఇందులో భాగంగా స్టార్ మ‌హిళ కార్య‌క్ర‌మం ప్ర‌యాణం కూడా ముగిసింది. వినూత్న కార్య‌క్ర‌మం ప్రేక్ష‌కుల ముందుకు తేవాల‌నే ఉద్దేశంతో స్టార్ మ‌హిళ‌కి ముగింపు ప‌లికాం. ఈ కార్య‌క్ర‌మాన్ని మీరు ఎంత మిస్ అవుతార‌నేది మేం అర్ధం చేసుకుంటా. మీరు నాకు, స్టార్‌ మహిళకు వీరాభిమానులైతే, నేనంటే మీకు అభిమానముంటే ఓ చిన్న సెల్ఫీ వీడియో తీసి పంపండి. ఇందులో నేను కాని స్టార్ మ‌హిళ‌కాని ఎంత ఇష్ట‌మో తెలపాల‌న్నారు. బెస్ట్ వీడియోల‌ని ఫినాలే ఎపిసోడ్‌లో ప్ర‌సారం చేయ‌నున్న‌ట్టు సుమ తెలిపింది. మీరు చూపించిన‌ ప్రేమను, స్టార్‌ మహిళ ప్రోగ్రామ్‌ను ఎప్పటికీ నా గుండెల్లో దాచుకుంటాను’’ అని సుమ ఈ వీడియోలో తెలిపారు.

Next Story