logo
సినిమా

శ్రీదేవి కోరిక మేరకు తెల్లపూలతోనే..

శ్రీదేవి కోరిక మేరకు తెల్లపూలతోనే..
X
Highlights

దేవకన్య చివరి మజిలీ మొదలైంది. తెల్లని స్వచ్చమైన పూలను ఇష్టపడే శ్రీదేవికి చివరి సారి సాగనంపేందుకు తెల్లని పూలతో ...

దేవకన్య చివరి మజిలీ మొదలైంది. తెల్లని స్వచ్చమైన పూలను ఇష్టపడే శ్రీదేవికి చివరి సారి సాగనంపేందుకు తెల్లని పూలతో అలంకరించిన వాహనాన్ని సిద్ధం చేశారు.. ఆవాహనంలోనే శ్రీదేవి భౌతిక కాయాన్ని ఉంచారు. భౌతిక కాయం వెంట బోనీ కపూ్ర్, ఇద్దరు కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.

దేశంలో ఒకరిద్దరు ప్రముఖులకు తప్ప మరెవరికీ ఇంత పెద్ద ఎత్తున అంతిమ యాత్ర సాగినది లేదు.. దారి పొడవునా జన సంద్రంతో రోడ్లు నిండిపోవడంతో అత్యంత భారంగా యాత్ర సాగుతోంది. దేశం నలుమూలల నుంచి ఆ అందాల సుందరిని సాగనంపడానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. మొత్తం ఆరు కిలోమీటర్ల మేర శ్రీదేవి అంతిమ యాత్ర సాగుతోంది. పవన్ హన్స్ స్మశాన వాటికలో ఆమె అంతిమ సంస్కారాలు జరుగుతాయి. శ్రీదేవిని కడసారి చూసేందుకు వచ్చిన జనంతో ముంబై జన సంద్రాన్ని తలపిస్తోంది.

Next Story