logo
సినిమా

నా పెళ్లి అక్కడే జరుగుతుంది: జాన్వి కపూర్‌

నా పెళ్లి అక్కడే జరుగుతుంది: జాన్వి కపూర్‌
X
Highlights

శ్రీదేవి న‌ట వార‌సురాలిగా జాన్వి కపూర్‌ బాలీవుడ్ తెరంగేట్రం చేసింది. క‌ర‌ణ్ జోహార్ నిర్మించిన 'ధ‌డ‌క్'...

శ్రీదేవి న‌ట వార‌సురాలిగా జాన్వి కపూర్‌ బాలీవుడ్ తెరంగేట్రం చేసింది. క‌ర‌ణ్ జోహార్ నిర్మించిన 'ధ‌డ‌క్' సినిమాతో జాన్వి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. తొలి సినిమాతోనే న‌టిగా జాన్వి మంచి మార్కులు సంపాదించుకుంది.ఈ సినిమా తరవాత ఆమెకు వరుస ఆఫర్లు వెల్లువెత్తున్నాయి. ప్రస్తుతం ఆమె కరణ్ జోహార్ యొక్క 'తక్త్' మూవీ చేస్తోంది. ప్రముఖ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్రా డిజైన్ చేసిన పెళ్లికుమార్తె దుస్తులు ధరించి ‘బ్రైడ్స్‌ టుడే’ మ్యాగజైన్‌కు ఫొటోషూట్‌ ఇచ్చింది. ఈ సందర్భంగా వారు నిర్వహించిన ఇంటర్వ్యూలో జాన్వి మాట్లాడింది. తాను ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నానన్న విషయం తెలీదు కానీ చేసుకుంటే మాత్రం ఇటలీలోని ఫ్లోరెన్స్‌ ప్రాంతంలోనే చేసుకుంటానని అంటోంది. గతంలో తన తల్లిదండ్రులతో కలిసి విహారయాత్ర నిమిత్తం ఫ్లోరెన్స్‌కు వెళ్లినప్పుడు ఆ ప్రాంతపు అందాలను చూసి మతిపోయిందని తెలిపింది. అందుకే అక్కడే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది.

Next Story